అమెరికా వెళ్లే విద్యార్థులకు ఎయిరిండియా తీపికబురు చెప్పింది. ఆగస్ట్ తొలివారం నుంచి అమెరికాకు విమాన సర్వీసులు రెట్టింపు చేస్తామని.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఇటీవల పలు అంతర్జాతీయ సర్వీసులను ఎయిరిండియా రీషెడ్యూల్ చేయడంతో విద్యార్థులు అసంతృప్తికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఎయిరిండియాకు విజ్ఞప్తులు పంపగా.. స్పందించిన సంస్థ ఈ ప్రకటన చేసింది.

ఇక భారత్ లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను డీజీసీఏ ఆగస్ట్ 31వరకు పొడిగించింది. అయితే కార్గో విమానాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీసీఏ ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు భారత్ లో కొత్తగా 41వేల 649కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. 6శాతం తగ్గాయి. ఇక మరో 593మంది కరోనాతో కన్నుమూశారు. మరోవైపు గడిచిన 24గంటల్లో 37వేల 291మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3కోట్ల 16లక్షళ 13వేల 993కు చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 8వేల 920మంది.. కోలుకున్నవారు 3కోట్ల 7లక్షల 81వేల 263మంది ఉన్నారు. మరణాలు అయితే 4లక్షల 23వేల 810కి చేరాయి.

కరోనా కారణంగా ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రయాణీకులపై అమలులో ఉన్న నిషేధాన్ని పొడిగించింది. ఇండియా నుంచి వచ్చే వారిపై ఇప్పటికే అమలులో ఉన్న నిషేధాన్ని ఆగస్ట్ 15వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. డెల్టావేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకుందట. ఫిలిప్పీన్స్ లో భారత మెడికల్ విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. భారత ప్రయాణీకులపై ఫిలిప్పీన్స్ ఏప్రిల్ లో మొదట నిషేధం విధించింది.


ఎయిరిండియా తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తమ కల నెరవేరబోతోందని ఎగిరి గంతేస్తున్నారు. అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి.. ప్రయోజకులుగా తిరిగి రావాలని మనమూ కోరుకుందాం..



 


మరింత సమాచారం తెలుసుకోండి: