అయితే ఈ సమావేశం గురించిన ఖచ్చితమైన సమాచారం కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఇతర పార్టీల నుండి కానీ రాకపోవడం గమనార్హం. దేశంలో అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలలోని ప్రతి పక్ష పార్టీలు అన్నీ కూడా తమ బలాన్ని పెంచుకుంటున్నాయని ఈ సందర్భంగా సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయని రౌత్ తెలిపారు. అందరూ ఒక్కటిగా ఉండి మోదీ నాయకత్వానికి చరమగీతం పాడుతామని తెలిపారు. కాగా ఈ సమావేశం గురించిన అధికారిక సమావేశం త్వరలో వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇలా ఒక్క ప్రకటనతో గాంధీని ఫిదా చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే.
అయితే వీరనుకుంటున్నట్లు బీజేపీని ఓడించడం అంతా సులభమయిన పని కాదని తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగా బీజేపీ కూడా ప్రణాళికలకు పదును పెడుతోంది. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమైనా చేయగల సమర్ధుడు. గెలవడానికి చేయవలసిన పనులు, పన్నాల్సిన వ్యూహాలు తన అమ్ముల పొదిలో బోలెడున్నాయి. కాబట్టి ఈ సారి ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలు ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి