ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కనీసం తిందామంటే తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అక్కడ చంటి బిడ్డల పరిస్థితి అయితే మరి దారుణంగా తయారైందని చెప్పవచ్చు. ఆకలి కేకలతో ప్రజలంతా కొట్టుమిట్టాడుతున్నారు. పసి బిడ్డల కడుపు నింపేందుకు తల్లులు తల్లడిల్లుతున్నారు. చివరికి ఇంట్లోని వస్తువులను కూడా అమ్మేసి వారి ఆకలి తీర్చడం కోసం వెనకాడటం లేదంటే వారి దుస్థితి ఏ విధంగా తయారు అయిందో, వారి పరిస్థితి ఏ విధంగా ఉందో  మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని  పూర్తిగా వారి చేతిలోకి తీసుకున్న తాలిబన్లు  తమ ఇష్టారాజ్యంగా పాలిస్తూ ప్రజలను  చిత్రహింసలు పెడుతూ విందులు వినోదాలతో తేలిపోతున్నారు. పిల్లల కడుపు నింపడం కోసం ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకునే  దారుణ పరిస్థితికి వారు వచ్చారు. లక్షల రూపాయలు పెట్టి ఉన్నటువంటి వస్తువులు ఎన్ని వస్తే అన్ని డబ్బులకు అమ్మేసుకున్నారు.

పనులు లేక  చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా  నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితిలో వారు ఉన్నారు. వారి యొక్క కుటుంబాల, చిన్న పిల్లల ఆకలి తీర్చడానికి కోసం  ఇంట్లోని ఫ్రీజ్ లు, కూలర్లు, టీవీలు, సోఫా సెట్లు వంటివి అమ్ముకుంటున్నారు. అయితే ఈ వస్తువులు అమ్మితే కనీసం కొనేవారు లేక అవి కూడా అమ్ముడు పోలేని పరిస్థితి దాపురించింది. ఇలా ఇంట్లోని వస్తువులను అమ్ము తుండడంతో కాబూల్ నగరం లోని రోడ్లన్నీ అంగడి బజార్ లా మారాయి. వారు అనుకున్నంతా రేటు రాకపోయినా  తక్కువ ధరకే వస్తువుల్ని అమ్ముతూ వారి పిల్లలు ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా లాల్ అనే వ్యక్తి మాట్లాడుతూ నేను ఒకప్పుడు పెద్ద వ్యాపారిని. కానీ ప్రస్తుతం నా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. మా ఇంట్లోని వస్తువులు అన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యాపారం ఏ విధంగా ఉన్నా పిల్లలు ఆకలి తీర్చాలంటే లక్షలు పెట్టి కొన్న వస్తుంది అమ్మ వలసి వస్తుందని అన్నాడు.

25 వేల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఫ్రిడ్జ్ ఐదు వేల రూపాయలకి అమ్మేశానని, కానీ డబ్బులు ఇంటికి ఎన్నిరోజులు సరిపోతుందో కూడా తెలియదని  తర్వాత పరిస్థితి ఆలోచిస్తేనే కన్నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 20 సంవత్సరాల తర్వాత ఆప్ఘన్ దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్న తాలిబాన్లు నెల దాటిపోయింది. మీరు కూడా అధికారికంగా పాలన చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశం మొత్తం సంక్షోభంలో ఆర్థికంగా మునిగిపోయింది. ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆహార నిల్వలు అందించిన  అవి ఎక్కడికి సరిపోవడం లేదు. అయితే ఆఫ్గాన్  ప్రజలు ఇంకా ఎన్ని రోజులు    ఈ కష్టాలు అనుభవించాలో అది చూస్తే ఆవేదన కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: