ఒకప్పుడు అగ్ర రాజ్యాల తో పోల్చి చూస్తే భారత్లో రక్షణ రంగం ఎంతో బలహీనంగానే ఉండేది అని చెప్పాలి.  రక్షణ రంగంలో అధునాతన ఆయుధాలు గాని సైనికులకు సరైన మౌలిక వసతులు కలిగి ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో భారత రక్షణ రంగం అంత పటిష్టంగా మారుతుంది. ఏకంగా అగ్రరాజ్యాల సైతం ఆశ్చర్య పోయే విధంగా ప్రస్తుతం భారత త్రివిధ దళాలు ఎంతో పటిష్టంగా మారిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను కొనుగోలు చేయడంలో భారత ప్రభుత్వం ముందు ఉంటుంది. ఇక దేశ బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీగా నిధులు సైతం కేటాయిస్తోంది.


 అదే సమయంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సైనికులు సమర్థవంతంగా శత్రు దేశాలపై యుద్ధం చేయడానికి సరిహద్దుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంలో కూడా భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతోంది.  అదే సమయంలో భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో వినూత్నమైన ఆయుధాలను కూడా తయారు చేస్తుంది.  ఇప్పటికే రాఫెల్ లాంటి అధునాతన టెక్నాలజీతో కూడిన యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరడంతో భారత రక్షణ రంగం ఎంతో పటిష్టంగా మారింది. ఇక ఇప్పుడు భారత ఆర్మీ ని మరింత పటిష్టం చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.



 ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భారత అమ్ములపొదిలో 118 యుద్ధ ట్యాంకు లు త్వరలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ తో భారత రక్షణశాఖ ఇటీవలే భారత ఆర్మీ కి 118  ఎంబిటి అర్జున ట్యాంకులను అందించాలి అంటూ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఈ ఒప్పందం విలువ 7523 కోట్లు కావడం గమనార్హం. నూతన టెక్నాలజీతో కూడిన ఈ యుద్ద ట్యాంకులు సైన్యాన్ని మరింత పటిష్టవంతంగా మార్చుతాయని సైనికులకు అదనపు శక్తి గా నిలుస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. మేకిన్ ఇండియా కు ఈ ఆఫర్ లు మరింత ఊతం ఇస్తాయి భారత రక్షణ శాఖ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: