ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ లైన్ దాటే నేత‌ల విష‌యంలో ఉపేక్షించ‌డం లేదు. ఎంత పెద్ద నేత అయినా కూడా నేరుగానే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇస్తే వార్నింగ్ ఇవ్వ‌డం.. లేదా అప్ప‌ట‌కి కంట్ర‌ల్లోకి రాక‌పోతే పార్టీలో ఉంటే ఉండండి.. లేక‌పోతే బ‌య‌ట‌కు పొండ‌ని చెప్పేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌దే ప‌దే పార్టీకి త‌ల‌నొప్పిగా మారుతోన్న న‌ర‌సాపురం ఎంపీ క‌నుమూరు ర‌ఘురామ కృష్నంరాజును సైతం వ‌దులుకున్నారు.

ఇక మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సైతం పార్టీని ఇబ్బంది పెట్టేలా  వ్యాఖ్యానిస్తే ఉంటే పార్టీలో ఉండండి.. లేకపోతే వెళ్లిపొండ‌ని చెప్పేశారు. ఆ త‌ర్వా త ఆనం సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీలో మ‌రో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌లు పార్టీకి . పార్టీ నేత‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. తూర్పు గోదావ‌రి జిల్లాలో రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌, రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా మ‌ధ్య జ‌రుగుతోన్న ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుని ఒక‌రిపై మ‌రొక‌రు నేరుగానే విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కు వ‌చ్చేసింది.

ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రు వైసీపీ నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు రేపు ఉదయం తాడేపల్లికి రానున్నారు. ఈ మేర‌కు పార్టీ అధిష్టానం నుంచి ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఫోన్ వెళ్లింది. వీరిద్ద‌రు విమ‌ర్శ‌లు చేసుకుని పార్టీ ప‌రువు ర‌చ్చ‌కీడ్చ‌డంతో పాటు పార్టీని చాలా డ్యామేజ్ చేస్తున్నార‌ని వైసీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉంది.

ఈ క్ర‌మంలోనే వీరి మ‌ధ్య‌ విభేదాలను తొలగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించ‌డంతో పాటు రేపు తాడేప‌ల్లి ర‌మ్మ‌ని పిలిపించింది. రేపు ఉదయం తాడేపల్లిలో తూర్పు గోదావరి పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డితో వీరు ముందు స‌మావేశం అవుతారు. త‌ర్వాత ఈ నివేదిక జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళుతుంది. జ‌గ‌న్ వీరిద్ద‌రిపై ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: