కల్వకుంట్ల కుటుంబంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు.  కేసీఆర్ కుటుంబం చేసిన తప్పులను కేంద్రం వదిలి పెట్టదని హెచ్చరించారు. కొకైన్ టు కాళేశ్వరం అవినీతి సమాచారాన్ని కేంద్రం సేకరించిందని..  కేటీఆర్ కొకైన్ రామారావు గా మారిపోయాడని మండిపడ్డారు.  కేటీఆర్, కవితల డబ్బు పిచ్చితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావటం లేదని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ డ్రగ్స్  టెస్టులు ఎక్కడ వరకు వచ్చాయో ప్రజలకు చెప్పాలి ? అని చురకలు అంటించారు.    దేశాన్ని నడుపుతున్నామని చెప్పే కేటీఆర్ .. భూములు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలి ? అని నిలదీశారు.
 
కేటీఆర్, కవితల వల్ల నే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజ ద్రోహం కేసు పెడతారా ? కేటీఆర్ ధైర్యం ఉంటే నా మీద పెట్టాలని సవాల్ విసిరారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.  చచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని  లేపేందుకు కేసీఆర్, కేటీఆర్ లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు.  గజ్వేల్ లో కాంగ్రెస్ సభ సీఎం కేసీఆర్ ప్రణాళిక లో భాగమని పేర్కొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్..  రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో .. ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.  


ఎంత వరి పండినా కొంటామన్న సీఎం కేసీఆర్ .. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు  ఎంపీ ధర్మపురి అర్వింద్.  నూతన వ్యవసాయ చట్టాలతో నాయకులకు మాత్రమే ఇబ్బందని... రైతులకు కాదన్నారు  ఎంపీ ధర్మపురి అర్వింద్. తమ జేబులు నింపుకోవటానికి కల్వకుంట్ల కుటుంబం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు చేశారు  ఎంపీ ధర్మపురి అర్వింద్.ఫసల్ బీమా కు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవటం వలన రైతులు నష్ట పోతున్నారని ఫైర్ అయ్యారు  ఎంపీ ధర్మపురి అ ర్వింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: