ఆంధ్ర ప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే టి‌డి‌పి-జనసేనలు పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టాలంటే టి‌డి‌పి-జనసేనలు కలవాల్సిందే విశ్లేషణలు వస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీలు బి‌జే‌పితో కలుస్తాయా? అసలు బి‌జే‌పి ఆ రెండు పార్టీలతో కలుస్తుందా? లేదా అనేది క్లారిటీ లేదు.

అయితే అధికార వైసీపీ అనధికారికంగా బి‌జే‌పితో మంచి సంబంధాలు నడుపుతూ వస్తుంది. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నా సరే కేంద్ర స్థాయిలో మాత్రం జగన్....బి‌జే‌పితో దోస్తీ చేస్తున్నారు....రాష్ట్ర ప్రయోజనాలు కావొచ్చు...ఇతర ప్రయోజనాలు కావొచ్చు...జగన్ మాత్రం మోడీ ప్రభుత్వంతో సఖ్యతగానే ఉంటున్నారు. అయితే రాజ్యసభలో బలం తక్కువ ఉన్న నేపథ్యంలో బి‌జే‌పి కూడా జగన్‌ని దగ్గర చేసుకుంటూనే ఉంది.

ఇక వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బి‌జే‌పి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సీట్లు దాటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే బి‌జే‌పి...పలు ప్రాంతీయ పార్టీలని కలుపుకుని మళ్ళీ అధికారంలోకి రావాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది...అందుకే జగన్‌ని కూడా దగ్గర చేసుకునేందుకు చూస్తున్నట్లు సమాచారం. తాజాగా కేంద్రమంత్రి రాందాస్‌ అథావలే కూడా జగన్...ఎన్డీయేలో చేరాలని కోరారు.

వైసీపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏలో చేరాలని, అది జరిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, జగన్‌ తనకు మిత్రుడని,  కేంద్రంలో చేరతానని చెబితే తానే స్వయంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసి మాట్లాడతానని రాందాస్ చెప్పుకొచ్చారు. అంటే ఇప్పటినుంచే జగన్‌ని దగ్గర చేసుకునేందుకు బి‌జే‌పి పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటు రాష్ట్రంలో కూడా వైసీపీకి రాను రాను వ్యతిరేకత పెరుగుతుంది.

ఈ క్రమంలో బి‌జే‌పికి దగ్గరైతే రాజకీయంగా ప్రయోజనం చేకూరే అవకాశం కూడా లేకపోలేదు. అంటే జగన్ వల్ల బి‌జే‌పికి...బి‌జే‌పి వల్ల జగన్‌కు బెనిఫిట్స్ ఉన్నాయనే చెప్పాలి. మరి జగన్...బి‌జే‌పితో దోస్తీ కుదుర్చుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: