ప్రస్తుతం ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితిలో ఎప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అనే విషయం తెలిసిందే. ఉగ్రవాదులను ఇతర దేశాల సరిహద్దు లోకి అక్రమంగా పంపించి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ముఖ్యంగా భారత్ లో ఇప్పటికే ఎన్నో సార్లు అల్లకల్లోల పరిస్థితులు సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇక భారత్ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది అన్న విషయాన్ని ఐక్య రాజ్యసమితి వేదిక ఎన్నో సార్లు నిరూపించింది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక ఉగ్ర దేశంగా పేరుపొందిన పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఏటీఎఫ్ లో గ్రే లిస్టులో కొనసాగుతుంది. అయితే గ్రే లిస్ట్ నుంచి రెడ్ లిస్టులో పెట్టడానికి ఐక్యరాజ్యసమితి భావించినప్పటికీ టర్కీ చైనా సహా మరికొన్ని దేశాలు ఇక పాకిస్తాన్ వైపు ఉండడంతో రెడ్ లిస్టులో పెట్టకుండా గ్రే లిస్టులోని పాకిస్తాన్ కొనసాగిస్తుంది ఐక్యరాజ్యసమితి   అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్ మిత్ర దేశానికి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఎఫ్ఏటీఎఫ్ ఊహించని  షాక్ ఇచ్చింది.



 పాకిస్తాన్ మిత్ర దేశంగా కొనసాగుతూ.. పాకిస్తాన్ ని రెడ్ లిస్టులో పెట్టకుండా మద్దతు ఇచ్చే టర్కీ దేశానికి కూడా ఇటీవలే రెడ్ లిస్టులో చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల ఈ విషయాన్ని ఎఫ్ఏటీఎఫ్ ప్రకటించింది. టర్కీ దేశం తో పాటు జోర్దాన్, మాలి దేశాలను కూడా ఈ గ్రే లిస్టులో చేర్చింది.  కాగా ఇప్పటికే గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్ ను అలాగే కొనసాగిస్తూ టర్కీ ని కూడా గ్రే లిస్ట్ లో చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి  అయితే ఎఫ్ ఎస్ టి ఎఫ్ ఇలా గ్రే లిస్టులో ఏదైనా దేశాన్ని చేర్చింది అంటే చాలు ఆ దేశాలకు విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి అంతే కాకుండా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు కూడా దెబ్బతింటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: