ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడే కృష్ణ‌దాస్‌ తన సోదరుడి మాటను కాదని మరి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ మీద ప్రేమతో తన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ విజయం సాధించి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి తొలి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో కృష్ణ‌దాస్ త‌న మ‌రో సోద‌రుడిపైనే గెలిచి జెయింట్ కిల్ల‌ర్‌గా నిలిచారు. ఆ ఎన్నిక‌ల్లో కృష్ణ‌దాస్‌ను ఓడించేందుకు మంత్రి గా ఉన్న ప్ర‌సాద‌రావు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే కృష్ణ దాస్ విజ‌యాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేదు.

2014 లో జరిగిన ఎన్నికల్లో కృష్ణ‌దాస్‌ మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ గత సాధారణ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్మాన ప్రసాదరావు సీనియర్ కోటాలో మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ మాత్రం త‌న కోసం త్యాగం చేసిన కృష్ణ‌దాస్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల జరిగిన మార్పుల నేపథ్యంలో కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎంగా కూడా పదోన్నతి కల్పించారు.

అంతేకాకుండా కీలకమైన రెవెన్యూ శాఖను కట్టబెట్టారు. ఇదిలా ఉంటే మరో రెండున్నర సంవత్సరాలలో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కృష్ణ‌దాస్ పోటీ చేయ‌ర‌ని ... ఆయన తనయుడు ఈ ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై కృష్ణ‌దాస్ స్పందించారు.

2024 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి తానే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చేశారు. జగన్ ఎంతో విజ‌న్ ఉన్న నాయకుడు అని ... చంద్రబాబు వి దిగజారుడు రాజకీయాలు అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికలలో నరస‌న్న‌పేట లో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తాను అని ధీమా వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: