అధికార పార్టి వైసీపీలో ఇప్పుడు ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  చాలా సమస్యల్లో ఉన్నారు. ఇటు రాజకీయ పరంగా ... అటు కుటుంబ పరంగా మరోవైపు కేసులు ... మరోవైపు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు అన్న చర్చ నడుస్తోంది. జగన్‌కు ఇటీవల పెద్దగా కాలం కలిసి రావడం లేదు. తన సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్నారు. మరోవైపు తల్లి విజయలక్ష్మి కూడా జగన్ కు దూరం జరుగుతున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. భారీ మెజారిటీ ఉండి కూడా తాను ఏం చేయలేకపోతున్నా అన్న ఆవేదన అయితే జగన్ కు ఎక్కువగా ఉంది. ఈ సమయంలో జగన్ తన ఇంటి వద్ద గోశాల ఏర్పాటు చేయడం ఇప్పుడు అధికార వైసీపీతో పాటు .. ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కొత్త‌గా ఏర్పాటు చేసిన గోశాలను ఈ సాయంత్రం చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి తో కలసి జ‌గ‌న్  సందర్శించారు. తాడేపల్లి సిఎం నివాసం సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఈ ఉదయం ప్రారంభం అయిన గోశాల కు తిరుపతి నుంచి  ఆరు గోవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీసుకు వ‌చ్చారు. ముందుగా ఈ ఆవుల కు సిఎం జగన్ సతీమణి భారతి గోవులకు పూజచేసిన తరువాత వాటిని గోశాలకు తరలించారు.

ఉన్న‌ట్టు ఉండి స‌డెన్ గా ఈ గోశాల ఏర్పాటుపై వైపిపి నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ అయితే ఎక్కువుగా న‌డుస్తోంది. జ‌గ‌న్ కు ప‌ట్టిన గ్ర‌హ దోషం పోయేందుకు ఈ గోశాల ఏర్పాటు చేశార‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: