ముఖ్యంగా నేటి రోజుల్లో ధూమపానం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో పెద్ద వాళ్లే కాదు అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు సైతం ధూమపానానికి అలవాటుపడి బానిసలుగా మారిపోతున్నారు. జీవితాన్ని ఎంతో దుర్భరంగా మార్చుకుంటున్నారు. ఇలా సిగరెట్ తాగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పలు దేశాల ప్రభుత్వాలు ధూమపానం విషయంలో కఠిన ఆంక్షలను కూడా అమలు చేస్తూ ఉన్నాయి. ఇటీవలే న్యూజిలాండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ధూమపానం పై జీవిత కాల నిషేధం విధించేందుకు సిద్ధమైంది న్యూజిలాండ్ ప్రభుత్వం.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని న్యూజిలాండ్ ప్రభుత్వం ఇలా సిగరెట్ల పై బ్యాన్ విధించింది అని చెప్పాలి. వచ్చే ఏడాది నుంచి ఇక ఈ కొత్త చట్టం అమలులోకి రాబోతుంది. కొత్త చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారికి సిగరెట్లు అమ్మటం చట్ట వ్యతిరేకం. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సిగరెట్లు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు అధికారులు. ఈ వయసును ప్రతి ఏటా పెంచుకుంటూ పోతుంది న్యూజిలాండ్ ప్రభుత్వం. దీంతో 2008 తర్వాత పుట్టిన వారు ఎవరూ కూడా జీవితంలో సిగరెట్లు తాగరూ అని చెప్పాలి.. దేశంలో ఉన్న సిగరెట్ విక్రయ షాపుల సంఖ్య 500 తగ్గిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది న్యూజిలాండ్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో ప్రపంచ దేశాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి