అత్యాధునిక వైద్య సదుపాయాలు అద్భుతమైన మౌలిక వసతులు ఉన్నాయి. ఇక ప్రపంచ దేశాలలో మేమే నెంబర్ వన్ అంటూ చెప్పుకునే అగ్రరాజ్యాల లో ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తీరు చూస్తుంటే ప్రపంచ దేశాల భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రపంచ దేశాల్లో నెంబర్వన్ మేమంటే మేమంటూ చెప్పుకునే అమెరికా బ్రిటన్ లో భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలో రోజు పది లక్షలకు పైగా కేసులు వెలుగు లోకి వస్తుంటే బ్రిటన్లో రెండు లక్షల వరకు కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి రోజురోజుకీ.
అయితే బ్రిటన్లో ప్రస్తుతం ఒక వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోవడమే కాదు మరణాల సంఖ్య కూడా విపరీతంగా ఉంది. ఏ దేశంలో లేనంతగా బ్రిటన్లో మరణాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొత్తంగా చూసుకుంటే యూరోపియన్ యూనియన్ మొత్తంలో అటు బ్రిటన్ లోనే ఎక్కువ మరణాలు వెలుగులోకి వచ్చాయి అన్నది తెలుస్తోంది. అయితే కేవలం 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉండడం విడ్డూరంగా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి