మొన్నటి వరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు జగన్  ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పిఆర్ సి ని వ్యతిరేకిస్తూ ఉద్యమ బాట పట్టారు. పిఆర్సి ని రద్దు చేసేంత వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలకు ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి వారి డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించింది. దీంతో ఇక ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న సమ్మె పూర్తిగా విరమించారు అనే విషయం తెలిసిందే.



 అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంబిస్తోంది అంటూ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం తీరు మార్చుకోని ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమైన జనసేన ను కూడా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.


 తాజాగా వైసీపీ మంత్రి సజ్జల పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. టిడిపి నేత  వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్  ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలంబిస్తోందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అయితే ఆధిపత్య ధోరణి అనే పదం బాగుందని పవన్ కళ్యాణ్ వాడినట్లు ఉన్నారు అంటూ సజ్జల సెటైర్ వేశారు. ఎందుకంటే చర్చల్లో ఆధిపత్య ధోరణి అనడానికి  అర్థం ఏమైనా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తాము అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నామని టీడీపీ ఏకంగా వేల ఎకరాల భూములను అమ్మాలనే పాలసీని పెట్టుకుంది అంటూ సజ్జల విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: