
ఈ విషయం లో అప్పటి నుండి ఇప్పటి వరకు అధికార పార్టీకి ప్రత్యర్ధి పార్టీ టిడిపికి నడుమ రాజదాని యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై మంత్రి బొత్స టిడిపి పై విమర్శల వర్షం కురిపించారు. 2024 వరకు కూడా ఏపీకి రాజధాని హైదరాబాద్ నే అంటూ ఆయన వ్యాఖ్యలు చేయగా, టీడీపీ నేతల విమర్శలపై మంత్రి బొత్స మండిపడ్డారు. అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ మనిషి పొడవు అయితే సరిపోదు కాస్త బుర్ర కూడా పెరగాలి అంటూ కామెంట్లు విసిరారు. పైకేమో ఏపి కోసం పాటుపడుతున్నాం అంటారు కానీ హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తూ తమపాటికి తాము ఉంటారు.
కానీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం వ్యతిరేకిస్తారు. ఇది ఎంత వరకు సమంజసం. హైదరాబాద్ లో ఉంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాలన చేశారు. అంతేనా స్వార్దంగా ఆలోచించి దోపిడీ చేయాలనే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు, పాలనలో పారదర్శకత కనపడలేదు అన్నది వాస్తవం. అయితే చంద్రబాబు అమరావతి విషయంలో చేసింది మాత్రం నూటికి నూరు పాళ్ళు స్వార్ధ రాజకీయమేనని ఘంటాపధంగా బొత్స చెప్పారు. గతంలో చంద్రబాబు ఏపీలో లేకుండానే పాలన చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు ప్రగల్భాలు పలకడం మంచిదికాదని చంద్రబాబుకు హితవు పలికారు బొత్స. హై కోర్ట్ చెప్పిన విధంగానే అమరావతి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు.