ఇటీవలే పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఎన్నికల ఫలితాలలో ఆమ్ఆద్మీ పార్టీ సంచలనమే సృష్టించింది అన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇక పంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో ఘనవిజయాన్ని సాధించింది. దీంతో ఇక ఈ ప్రాంతీయ పార్టీకి జాతీయ హోదా పొందే అవకాశాలు మరింత మెరుగు పడ్డాయి అని చెప్పాలి. ఊహించని రీతిలో అమాద్మీ  పార్టీ ఏకంగా పంజాబీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం ఎంతో మంది రాజకీయ పండితులు సైతం కేజ్రీవాల్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.



 కేజ్రీవాల్ కృషి కారణంగానే పార్టీ ఈ స్థాయికి ఎదగ గలిగింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడం పై స్పందించిన నటుడు రాజకీయ నాయకుడు కమలహాసన్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు అభినందనలు అంటూ నటుడు కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలో ఢిల్లీతో పాటు ఇక పంజాబ్ లో కూడా విజయం సాధించడం ఎంతో అభినందనీయం అంటూ సోషల్ మీడియా వేదికగా కమలహాసన్ ప్రశంసలు కురిపించాడు.



 కాగా ఇప్పటి వరకూ మన దేశంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను మాత్రమే జాతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించింది అని చెప్పాలి. అయితే లోక్సభ లేదా రాష్ట్ర ఎన్నికల సమయంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో మొత్తం వాటాలను కనీసం ఆరు శాతం సాధించిన కూడా ఆ పార్టీ జాతీయ పార్టీ హోదాను పొందుతుంది. ఇక 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 54 శాతం ఓట్లు సాధించింది. ఇటీవలే జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లను సంపాదించింది. గోవాలో 6.7% ఉత్తరాఖండ్లో 3.4 శాతం ఉత్తరప్రదేశ్లో 0.3 శాతం వాటాను నమోదు చేసింది ఆమ్ఆద్మీ పార్టీ. ఇక ఆరు శాతం ఓట్ల వాట తో పాటు ఒక పార్టీ లేదా ఏదైనా రాష్ట్రం నుంచి పార్లమెంటులో కనీసం నాలుగు స్థానాలను గెలవాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఆమాద్మీ పార్టీకి లోక్సభలో కేవలం ఒక ఎంపీ మాత్రమే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: