
అలా గత 20 రోజుల క్రితం రష్యా కు మరియు ఉక్రెయిన్ కు మధ్యన యుద్ధం మొదలైంది. అయితే మొదట్లో రష్యా ఇన్ని రోజుల పాటు యుద్ధం చేయాల్సి వస్తుందని ఊహించనే లేదని తెలుస్తోంది, కొన్ని రోజులకే ఉక్రెయిన్ లొంగి పోతుందని భావించారు. కానీ అలా జరగకపోగా ఉక్రెయిన్ కూడా రష్యా కు ధీటుగా పోరాడుతోంది. ప్రస్తుతం ఈ యుద్ధం ఆపడానికి ప్రపంచంలో ఉక్రెయిన్ కు మద్దతు తెలుపుతున్న దేశాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రపంచ కుబేరుడు మరియు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్విట్టర్ వేదికగా వార్నింగ్ ఇచ్చాడు.
ఈయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పుతిన్ నీకు దైర్యం ఉంటే ఒంటరిగా నాతో పోరాడు అమాయక ప్రజలతో కాదు, మన ఇద్దరిలో గెలిచిన వారికే ఉక్రెయిన్ దేశం మీద హక్కు అంటూ సంచలన ప్రకటన చేశాడు. అంతే కాకుండా ఈ ట్వీట్ పై వెంటనే రిప్లై ఇవ్వలేను సూచించాడు. అయితే ట్విట్టర్ అకౌంట్ లేదన్న సంగతి తెలిసిందే. మరి ఎలా పుతిన్ ఇతని ట్వీట్ కు రిప్లై ఇస్తాడో చూడాల్సి ఉంది.