
రాజకీయ నేతలన్నాక కాస్త నిజాయితి, నిబద్ధత అవసరం. అయితే ఈ లక్షణాలు ఉన్న నేతలను వెతకాలంటే టార్చిలైటు వేసుకోవాల్సిందే. తాజాగా జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నతర్వాత తనలోని నిజాయితీని బయటపెట్టాయనే చెప్పాలి. వార్డు, సచివాలయాల వాలంటీర్లకు సన్మానం జరిగింది. నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతు తాను మంచి చేస్తున్నట్లు జనాలు మనసారా నమ్మితే మరోసారి ఆశీర్వదించమన్నారు.
అదే తనవల్ల చెడుజరుగుతోందని భావిస్తే తనను ధ్వేషించమన్నారు. అంటే జనాల మద్దతును జగన్ ఎంత డైరెక్టుగా కోరారో అందరికీ అర్ధమవుతోంది. ఇదే సమయంలో తన ప్రభుత్వంలో జరిగే మంచి, చెడుకు తనదే బాధ్యతని స్పష్టంగా జనాలకు చెప్పారు. ఇదే సమయంలో అంతర్లీనంగా మరో మెసేజ్ కూడా జనాలకు పంపారు. అదేమిటంటే తనను చూసే ఓట్లేయమని విజ్ఞప్తి చేయటం. అదికూడా రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో జరిగిన బహిరంగసభలోనే. తప్పొప్పులకు తనదే బాధ్యతని అంగీకరించేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు.
ఇక్కడే జగన్-చంద్రబాబునాయుడు మధ్య తేడా తెలిసిపోతోంది. మంచి జరిగితే తన క్రెడిట్ గాను, ఏదన్నా చెడు జరిగితే ఎదుటి వాళ్ళదే బాధ్యతనటమే చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే అందుకు బీజేపీతో పొత్తు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారం కీలకం. కానీ గెలిచిన తర్వాత తన అనుభవాన్ని చూసే జనాలు టీడీపీని గెలిపించారంటు ఊదరగొట్టారు.
అదే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీనికి కారణం జనాలను జగన్ మోసం చేసి ఓట్లేయించుకున్నారన్నారు. జగన్ మాటలకు జనాలు మోసపోయి టీడీపీని ఓడించారంటు శాపనార్ధాలుపెట్టారు. టీడీపీని ఓడించి జనాలు తప్పుచేశారంటు నానా గోలచేశారు. అంతేకానీ ఓటమికి తనదే బాధ్యత అని ఒక్కమాట కూడా చెప్పలేదు. గెలుపును తన క్రెడిట్ గాను ఓటమికి ఎదుటివాళ్ళని బాధ్యులను చేయటం చంద్రబాబుకు మొదటినుండి ఉన్న అలవాటే. ఇక్కడే జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటో జనాలకు అర్ధమవుతోంది.