ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా విన్నా వరుసగా పరువు హత్యలు వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. వేరే కులం లేదా వేరే మతం వాళ్లను పెండ్లి చేసుకున్నారన్న కక్షతో కుటుంబసభ్యులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.ఇక తాజాగా బీహార్ లో అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. పరువు కోసం కన్నకూతురినే ఓ తండ్రి చాలా దారుణంగా హత్య చేశాడు. అయతే ఈ ఘటన నెలరోజుల క్రితం నాడు జరగగా చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన ఓ ఆడియో కూడా బాగా వైరలైంది.ఇక పూర్తి వివరాల్లోకెళ్తే.. బిహార్లోని దర్భంగా జిల్లా రతన్పుర గ్రామంలో అఫ్రీన్(20) అనే యువతికి ఆమె తండ్రి ఉస్మాన్..ఇంకా తండ్రి వయసు ఉన్న ఓ వ్యక్తితో పెండ్లి కుదిర్చాడు. అయితే ఆ యువతి ఓ యువకుడిని ప్రేమించినట్టు అప్పుడు తెలిసింది. దాంతో కోపోద్రిక్తుడైన తండ్రి కన్న కూతురిని వెంటనే చంపాలనుకున్నాడు. ఆ యువతి..'నాన్న దయచేసి నన్ను చంపకండి ప్లీజ్.. నేను మీ కూతురిని, నన్ను దయచేసి వదిలేయండి` అని ఏంత వేడుకున్నా ఆమె తండ్రి మనసు కరగలేదు.ఏప్రిల్ 15 వ తేదీన అఫ్రీన్ను తండ్రి హత్య చేసి ఆమె మృతదేహాన్ని చెరువులో పడేశాడు. ఆ తరువాత కుమార్తె ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందినట్లు నమ్మించాడు. ఆ మరుసటి రోజు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు అఫ్రీన్ నీటమునగడం వల్లే మృతిచెందిందని భావించి ఎలాంటి కేసుని కూడా నమోదు చేయలేదు. మరోవైపు యువతి తనను నాన్నను వేడుకుంటున్న ఆడియో ఒకటి బయట పడి అది వైరల్ గా మారింది. ఇక అది ఆమె ప్రియుడు రికార్డు చేసినట్టుగా తెలిసింది.మరోవైపు అఫ్రీన్ హత్య విషయం బయట ఎక్కడా కూడా చెప్పొద్దంటూ ఉస్మాన్ .. తన కుటుంబసభ్యులను కూడా బెదిరించాడు.దాంతో అతని భార్య షబానా ఖాతునా ఇంకా ముగ్గురు పిల్లలు.. నెల రోజుల పాటు ఈ విషయాన్ని ఎవరికీ  కూడా చెప్పలేదు. అయితే ఈనెల 21 వ తేదీన వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని.. వైరలైన ఆ ఆడియోకు హత్య సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామని అక్కడి పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: