ఇల్లు కట్టుకోవడం అనేది అందరి కల. ప్రతి ఒక్కరూ తమకంటూ సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలని ఇది మా ఇల్లు అని గర్వంగా చెప్పుకోవాలని అనుకుంటుంటారు. తిండి ఉన్నా లేకున్నా నా ఇంట్లో నేను పడి ఉంటా అని కూడా అంటుంటారు. అయితే అందరికీ సొంతటి నిర్మాణం అంత సాధ్యం కాదు. సామాన్యుడు అయితే ఒక్కో రూపాయి పోగేసి మరి డబ్బులను దాచుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు.. అయితే పెరుగుతున్న ఇంటి నిర్మాణానికి కావలసిన సామగ్రి ధరలు మాత్రం తడవ తడవ కి పెరుగుతూ సామాన్యుడికి భారంగా మారుతూ వారి సొంతింటి కలకు అడ్డంకులుగా మారుతున్నాయి. గతంలో ఇసుక ధరలు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి,ఆ తరువాత సిమెంట్ ధరలు కూడా పెరిగి నెత్తిపై పిడుగుల్లా పడ్డ సంగతి తెలిసిందే..

కాగా తాజాగా ఇపుడు  ధరలు పెరుదలతో మరోసారి  సామాన్యుడిపై ఆర్ధిక భారం పడనుంది. ఒక వైపు నిత్యవసరాల సరుకుల ధరలతో పాటు అన్నింటి ధరలు ఏకధాటిగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తింటి కల సాకారం చేసుకునే వారికి మరో మారు గట్టి షాక్ ఎదురయ్యింది. ఇపుడు మరోసారి సిమెంట్ ధరలు పెరగనున్నాయి అని సమాచారం. ఇంటి నిర్మాణానికి  ఎంతో అవసరమైన సిమెంట్ ధరలను పెంచేస్తున్నారు. ప్రముఖ సిమెంట్ కంపెనీ అయినా ఇండియా సిమెంట్స్ పలు కారణాల వలన సిమెంట్ ధరలను పెంచుతున్నట్లు అధికారకంగా ప్రకటించింది.

భారత దేశంలోనే అతి పెద్ద సిమెంట్ కంపెనీలలో ఇండియా సిమెంట్స్ ఒకటి.  అయితే జూలై నుండి సదరు కంపెనీలు విడత వారిగా సిమెంట్ ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.  సిమెంట్ బస్తా లపై  ధర రూ. 55 మేర పెరగనున్నట్లు తెలుస్తోంది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాల ఖర్చు భారీగా పెరిగినందున ధరల పెంచాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించింది. జూన్ 1 నుండి ఒక్కో సిమెంట్ బస్తా పై రూ. రూ.20  పెరుగుతుందని పలు కంపెనీలు అంటున్నాయి. అలాగే జూలై 1 నుంచి సిమెంట్ రేటు రూ. 20 పెరగనుందని మరికొన్ని కంపెనీల ఉద్దేశం. ఇలా మొత్తంగా కనుక చూస్తే ఒక్కో సిమెంట్ బస్తా రేటు రూ. 55 మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. అయితే ఇది కొత్త ఇల్లు కట్టుకోవాలనే సామాన్యుడు ఆశలపై నీరు చల్లెలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: