ప్రభుత్వం ఆరోగ్యం పేరుతో జనాల ప్రాణాల తో చెలగాటం ఆడుతున్నారు..ఆరోగ్యం మాట పక్కన పెడితే అసలు వాళ్ళు ఇస్తున్న ఆహార పదార్ధాల వల్ల ప్రాణాలు ఉంటాయో, పోతాయో తెలియడం లేదు.. అందులో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి..తెలుగు రాష్ట్రాల లో గర్భిణీలకు, పిల్లలకు సరఫరా చేస్తున్న వస్తువులు క్వాలిటీ లేకుండా ఉండటం తో జనాలు ప్రభుత్వాన్ని నిలదీసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.. ఇది ఇలా వుండగా ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.


నిర్మల్‌ జిల్లాలో భైంసాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భైంసా పట్టణంలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లల కోసం పంపిణీ చేసిన కోడిగుడ్లు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి..అంగన్‌వాడి సెంటర్‌లో పంపిణీ చేసిన కోడిగుడ్లను ఉడకబెట్టి తినబోతే.. రబ్బరులా సాగుతున్నాయి. అదేంటని తీరా నెలకేసి కొడితే, కోడిగుడ్లు బంతిలా ఎగురుతున్నాయి. దీంతో వినియోగదారులు షాక్‌ అయ్యారు. వెంటనే ఇంట్లోని ఉన్న అంగన్‌ సెంటర్‌ నుంచి తీసుకొచ్చిన మిగిలిన గుడ్లు చెక్‌ చేయగా, అవి కూడా లోపలంతా విచిత్రంగా జిగురులాంటి పదార్థం కనిపించింది. దాంతో బాధితులంతా వాపోయారు.. ఇదేక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారు..


బాలింతలకు పసిపిల్లలకు అందిస్తున్న పోషకాహారంలోనూ కల్తీ చేస్తున్నారని, ప్లాస్టిక్ గుడ్లు సరఫరా చేశారని స్థానికులు ఆరోపించారు. కొన్ని గుడ్లు ఉడక బెట్టిన తర్వాత నల్లగా మారడం తో ప్రజలు షాక్‌ అయ్యారు. కోడి గుడ్లను ఉదగబెడితే స్పాంజ్ లాగా సాగుతున్నాయని, కొందరు దళారులు, వ్యాపారులు కుమ్మకై ప్రజల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడుతున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐసీడీఎస్ అధికారులను వివరణ కోరగా ఇదంతా తమ దృష్టికి రాలేదని అన్నారు. ప్లాస్టిక్‌ గుడ్లు కలకలంపై విచారణ చేపడుతామని సైలెంట్ అయ్యారు.. ప్రజలకు ఇవ్వక పోయిన పర్వాలేదు కానీ ఇలాంటి వాటిని ఇచ్చి ప్రాణాలను తీయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: