ఎన్టీయార్ విషయంలో తెలుగుదేశంపార్టీ చేస్తున్న రబసపై జూనియర్ ఎన్టీయార్ ఒక్కసారిగా నీళ్ళు చల్లేశారు. హెల్త్ యూనివర్సింటీకి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ అని ప్రభుత్వం పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబునాయుడు అండ్ కో నానా రచ్చ చేస్తున్నారు. ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సీఎంగా దింపేసి, పార్టీని లాగేసుకుని చివరకు ఆయన మానసిక క్షోభతో మరణించటానికి కారణమైన చంద్రబాబు అండ్ కో ఇపుడు నానా గోల చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

విచిత్రం ఏమిటంటే చంద్రబాబు పాలనలో కూడా కొన్ని పేర్లను తీసేసి ఎన్టీయార్ పేరు పెట్టారు. అప్పట్లో సంబంధించిన వాళ్ళు ఎంతగోల చేసినా పట్టించుకోలేదు. కాబట్టి పేర్లు పెట్టడం, మార్చేయటం రాజకీయంలో ఒక భాగమనే అనుకోవాలి. అయితే అలా అనుకోకుండా తమ్ముళ్ళు తెగ గోలచేస్తున్నారు. వీళ్ళు ఎంతైనా గోల చేయచ్చు కానీ జూనియర్ ఎన్టీయార్ ను బాగా గోకారు. తాత ఎన్టీయార్ పేరు తీసేస్తే జూనియర్ స్పందించరా ? జూనియర్ కేమీ పట్టదా ? అంటు తమ్ముళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు.


దానికి స్పందనగానా అన్నట్లుగా జూనియర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా కర్రవిరగకుండా పాము చావకుండా అన్నట్లుగా ఉంది. దాంతో తమ్ముళ్ళ ఆవేశంపై జూనియర్ నీళ్ళు చల్లినట్లయ్యింది. ‘ఎన్టీయార్, వైఎస్సార్ ఇద్దరు విశేష ప్రజాధరణ సంపాదించిన గొప్ప నాయకులు..ఈ రకంగా ఒకరిపేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్ధాయిని పెంచదు, ఎన్టీయార్ స్ధాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చటం ద్వారా ఎన్టీయార్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగుజాతి చరిత్రలో వారిస్ధాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న జ్ఞాపకాలను చెరిపేయలేరు.’

ఈ ట్విట్ ద్వారా జూనియర్ ఏమి చెప్పదలచుకున్నారో మామూలు వాళ్ళకి అర్ధంకాదు. జూనియర్ ను రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిడతారని ఆశించినట్లున్నారు. అయితే ఒకపట్టానా ఎవరికీ అర్ధంకాని పద్దతిలో ఒక ట్వీట్ పడేసి చేతులు దులుపుకున్నారు. ఇంతకీ జూనియర్ తన ట్వీట్ ద్వారా జగన్ నిర్ణయాన్ని సమర్దించారా ? వ్యతిరేకించారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: