జూనియర్ ఎన్టీయార్ అబిమానులు తెలుగుదేశంపార్టీని గట్టిగా తగులుకుంటున్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాంతో రాజకీయంగా పెద్ద రచ్చ మొదలైంది. జగన్ పై చంద్రబాబునాయుడు అండ్ కో రెచ్చిపోతున్నారు. పేరు పెట్టడం, తీసేయటం, మార్చటం తర్వాత రచ్చ జరగటం అంతా రాజకీయ క్రీడలో భాగమనే అనుకోవాలి.





ఈ క్రీడలో వైసీపీ-టీడీపీ ఆటాడుకుంటుంటే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఏ పార్టీ వ్యతిరేకించినా ఏ పార్టీ మద్దతుగా మాట్లాడినా అన్నీ రాజకీయ పార్టీలే కాబట్టి సర్వం జగన్నాథం లాగ అంతా రాజకీయమైపోయింది. మరి మధ్యలో తమ్ముళ్ళు జూనియర్ ను ఎందుకని తమ రచ్చలోకి లాగినట్లు ? జూనియర్ తో కూడా జగన్ ప్రభుత్వాన్ని తిట్టించాలన్నది తమ్ముళ్ళ ఎత్తుగడ. అయితే తమ్ముళ్ళ మైండ్ గేమ్ కు లొంగని జూనియర్ ఏదో తనకు తోచిన ట్విట్ ఒకటి పడేశాడు.





పైగా ఆ ట్వీట్లో ఎన్టీయార్, వైఎస్సార్ ఇద్దరూ ఎంతో ప్రజాధరణ కలిగిన నేతలన్నారు. దాంతో తమ్ముళ్ళకి మండింది. అందుకనే జూనియర్ ను ర్యాగింగ్ మొదలుపెట్టారు. దాంతో ఒళ్ళుమండిన జూనియర్ అభిమానులు రంగంలోకి దిగారు. జూనియర్ అభిమానులకు అసలే చంద్రబాబు, లోకేష్ అంటే చాలాకాలంగా మంటగా ఉంది. ఆ మంటనంతా ఇపుడు తీర్చేసుకుంటున్నారు.






జూనియర్ ను ర్యాగింగ్ చేస్తారా అన్నట్లుగా చంద్రబాబు, లోకేష్ పరువును అభిమానులు తీసేస్తు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ అసలు జూనియర్ కాలికింద పడుండాల్సిన వాళ్ళంటు పాత కథలన్నింటినీ తవ్వి తీస్తున్నారు. జూనియర్ స్ధాయి చంద్రబాబు, లోకేష్ కుందా అంటు ఇద్దరినీ నిలదీస్తున్నారు. అనవసరంగా జూనియర్ జోలికొస్తే ఎవ్వరనీ వదిలిపెట్టేది లేదంటు నానా రచ్చ చేస్తున్నారు. ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే టీడీపీ ఏకకాలంటో ఇటు వైసీపీతోను అటు జూనియర్ అభిమానులతోను యుద్ధం చేయాల్సొస్తోంది. జగన్ అంటే చంద్రబాబు, లోకేష్ లో ఉన్న మంట జూనియర్లో ఉండాల్సిన అవసరంలేదన్న కనీస లాజిక్ తమ్ముళ్ళందరు మిస్సయ్యారు. అందుకనే ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: