స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో కొత్త ఆఫర్లను అందిస్తుంది.స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ కూడా ఉన్నాయి. అలాగే పోస్టాఫీస్ కూడా తన కస్టమర్లకు వివిధ రకాల సేవింగ్ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచింది. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. అంటే రెండింటిలోనూ ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు.


మరి ఎందులో డబ్బులు పెడితే బెటర్? ఎక్కువ లాభం ఏ స్కీమ్స్‌లో వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు రూ. 10 లక్షలు పొందాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఏ స్కీమ్‌లో చేరితే ఎంత కాలానికి ఎంత మొత్తం పొందొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం. రెండింటిలోనూ ఒకే రకమైన వడ్డీ రేటు ఉండదు. అప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ కూడా చేంజ్ అవుతుంది.ఎస్‌బీఐ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ 28.10.2022 వరకు అందుబాటులో ఉంటుంది.


ఈ స్కీమ్ టెన్యూర్ 1000 రోజులు. అంటే దాదాపు మూడేళ్లు. సాధారణ కస్టమర్లకు 6.1 శాతం వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్స్‌కు 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే ఇక్కడ 6.1 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మూడేళ్లలో రూ.10 లక్షలు పొందాలంటే మాములుగా కస్టమర్లు 8.35 లక్షలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.పోస్టాఫీస్‌లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఉంది. ఇది స్మాల్ సేవింగ్ స్కీమ్. ఇండియా పోస్ట్ అందిస్తోంది. రూ.1000తో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. టెన్యూర్ 5 ఏళ్ల వరకు ఉంటుంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టెన్యూర్ ప్రాతిపదికన డబ్బులు ఎఫ్‌డీ చేయొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల వరకు అయితే వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. అదే ఐదేళ్ల టెన్యూర్ ఎఫ్‌డీలపై అయితే 6.7 శాతం వడ్డీ వస్తుంది. 5.5 శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే.. మూడేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో రూ. 10 లక్షలు పొందాలని భావిస్తే.. రూ.8.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.6.7 శాతం వడ్డీ లభిస్తుంది..అన్నిటికన్నా పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ అనే చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: