జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ మరో వివాదాస్పద 800 వందల మంది సభ్యుల తొలగింపు. అధ్యక్షుడు రవీంద్రనాథ్ నిర్ణయం పై భగ్గుమన్న సభ్యులు. న్యాయ పోరాటానికి సిద్ధమైన సభ్యులు, బుద్ధిచెబుతామని వెల్లడి. జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ సొసైటీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.. సొసైటీకీ కొత్త కమిటీ వచ్చిన తర్వాత అనేక వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ సొసైటీ ప్రతిష్టతను దిగజార్చుతున్నారు.. సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా, కమిటీ తీర్మానాలు లేకుండానే సొసైటీ ప్రెసిడెంట్‌ బి. రవీంద్రనాథ్ సొసైటీ బైలాస్‌కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

గత పాలకమండలిపై వ్యక్తిగత కక్షతో కో–ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు..సొసైటీ అభివృద్ధి కోసం పాత కమిటీ తీసుకున్న నిర్ణయాలపై రివ్యూలు చేస్తూ సొసైటీలో అక్రమాలు జరిగాయని, గొప్ప చరిత్ర కలిగిన సొపైటీ పేరును దిగజార్చుతున్నారు..అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ సొసైటీ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. గత కమిటీ సభ్యులపై కక్షపూరిత ధోరిణితో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ సొసైటీ ప్రతిష్టను దిగజార్చుతున్నారు.

పాత-కొత్త కమిటీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలపై కోర్టులో అనేక కేసులు నడుస్తున్నాయి..విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఈనెల(18-9-2022) ఆదివారం సొసైటీ ప్రెసిడెంట్‌ బి.రవీంద్రనాథ్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి మాజీ అధ్యక్షుడు టి.నరేంద్రచౌదరి, కార్యదర్శి టి.హనుమంతరావు, సీవీ.రావు, ఎ.మురళీముకుంద్‌, కిలారి రాజేశ్వర్‌ సభ్యత్వాలను రద్దు చేస్తూ ప్రతిపాదనను ప్రవేశపెట్టి వారి సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్టు సొసైటీ ప్రెసిడెంట్‌  పేరుతో పత్రిక ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు తమ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అర్థరాత్రి నోటీసు ఇచ్చి, తమను అన్యాయంగా సొసైటీ నుంచి తొలగించారని కార్యదర్శి ఎ.మురళీముకుంద్‌  హైకోర్టును ఆశ్రయించారు..సొసైటీ బై లాస్ ప్రకారం తమ వివరణ తీసుకోకుండానే సభ్యత్వాలు రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు..మరోవైపు సోసైటీ తరుపున హాజరైన న్యాయవాది సభ్యులను ఎవరిని సొసైటీ నుంచి తొలగించలేదని..అలాంటి తీర్మానాలు కమిటీ చేయలేదని కోర్టుకి తెలిపారు..ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సొసైటీ నుంచి సభ్యులను ఏకపక్షంగా తొలగించడం చెల్లదని, ఎ.మురళీముకుంద్‌ సొసైటీ సభ్యులుగా కొనసాగుతారని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో సొసైటీ అధ్యక్షుడి బండారం మరోసారి బయపడిందని సభ్యులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.. దాదాపు 800 మంది సభ్యులను సొసైటీ నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు రవీంద్రనాథ్ నిర్ణయం తీసుకుంది..అధ్యక్షుడి నిర్ణయాన్ని సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..తమను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని, పాలకమండలిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు..అధ్యక్షుడి నిర్ణయాలపై తాము న్యాయపోరాటం చేస్తూ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: