మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి.వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. ప్రతి నెలా ఎటువంటి ఆటంకం లేకుండా పెన్షన్ రావాలంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం చాలా ముఖ్యం. లేదంటే పెన్షన్ ఫండ్ ప్రయోజనాన్ని పొందలేరు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. పెన్షనర్లు పెన్షన్ కోసం ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీకు చివరి తేదీ తెలియకపోతే పెన్షన్ నిలిపివేసే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిలో మీరు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్‌ని తరచూ చెక్ చేస్తూ ఉండాలి..లైఫ్‌ సర్టిఫికెట్‌ లో ఆధార్ కార్డు ప్రకారం పెన్షనర్ల బయోమెట్రిక్, భౌతిక సమాచారం ఉంటుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది IT చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్. పెన్షన్‌ దారుల మనుగడకు ఇదే నిదర్శనం. దీని ఆధారంగా ప్రతినెలా పెన్షన్ మంజూరు చేస్తారు. జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ ప్రకారం సర్టిఫికేట్ తిరస్కరణకు గురైనట్లయితే పెన్షన్ ఇచ్చే సంస్థను సంప్రదించవచ్చు. మీరు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ ను రూపొందించేటప్పుడు తప్పు సమాచారం ఇస్తే దానిని తిరస్కరిస్తారు. సరైన సమాచారం తో మళ్లీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు..


ఈ మొబైల్ యాప్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే?


*. జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ ప్రకారం మొబైల్‌లో ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


*. యాప్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందుగా https://jeevanpramaan.gov.in కు వెళ్లాలి .
*. ఇప్పుడు ఈ మెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేయడానికి ఓకె చేయాలి.
*. తర్వాత ఈమెయిల్‌ లో వచ్చిన OTPని ఎంటర్‌ చేయాలి.
*.తర్వాత డౌన్‌లోడ్ మొబైల్ యాప్‌ పై క్లిక్ చేయాలి.
*. ఈ మెయిల్‌ లో వచ్చిన లింక్‌ పై క్లిక్ చేయడం ద్వారా మీరు apk ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: