ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గొంతు చాలా వేగంగా రెస్పాండవుతుంది. అదికూడా రీ సౌండు వినబడేట్లుగా. అదే ప్రతిపక్షాలది ఎక్కడైనా తప్పుంటే మాత్రం ఎన్నిరోజులైనా పవన్ గొంతు ఎక్కడా వినబడదు. అసలా ఘటన జరగలేదన్నట్లే వ్యవహరిస్తారు. ఇపుడిదంతా ఎందుకంటే అమరావతి ప్రాంతంలో దీక్ష చేస్తున్న అమరావతి జేఏసీ సభ్యులను పరామర్శించేందుకు సత్యకుమార్ వెళ్ళినపుడు దాడి జరిగిందట.





బీజేపీ జాతీయ కార్యదర్శి శిబిరం దగ్గరకు వెళ్ళగానే వైసీపీ మూకలు దాడులు చేశారంటు పవన్ రెచ్చిపోయారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే అధికారపార్టీ దాడులు చేయటం ఏమిటనేది పవన్ ప్రశ్న. రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామనే సంకేతాన్ని సమాజానికి పంపుతున్నారా అంటు జగన్మోహన్ రెడ్డి మీద పవన్ రెచ్చిపోయారు. ఆదినారాయణరెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారని సత్యకుమార్ చెప్పిన మాటను కూడా పవన్ ప్రస్తావించారు. అంటే సురేష్ అన్నారో లేదో కూడా పవన్ కు తెలీదు.





సత్యకుమార్ ఏమిచెబితే దాన్ని పవన్ గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఈ ఘటనను బీజేపీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలట. రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్న రాజకీయపార్టీలను, ప్రజాసంఘాలను ప్రభుత్వం వర్గ శతృవులుగా చూస్తోందని పవన్ ఆరోపించారు. అసలు వర్గశతృవు అనే పదం పవన్ కు బాగా నచ్చినట్లుంది. అందుకనే జగన్ కు వ్యతిరేకంగా పదే పదే ఆ పదాన్ని వాడేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే గొడవ ఎలా మొదలైందో తెలీదు.






మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేస్తున్న వారిపై బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాదు కాదు సత్యకుమార్ పై వైసీపీ వాళ్ళే దాడులు చేశారని బీజేపీ+పవన్ అంటున్నారు. ఇందులో వాస్తవం ఏమిటో తెలీదు. మొత్తానికి ఘటన అలా జరిగిందో లేదో వెంటనే పవన్ ప్రెస్ రిలీజ్ తో ప్రత్యక్షమైపోయారు. అదే వైసీపీ ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు లోబరుచుకుని క్రాస్ ఓటింగ్ చేయించుకున్న విషయం మీద మాత్రం పవన్ నోరిప్పలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: