మార్గదర్శి చిట్స్ ఫండ్స్ సంస్ధ ఛైర్మన్ రామోజీరావు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. సంస్ధలో భారీ అవకతవకలు జరిగాయని, హవాలా, మనీ ల్యాండరింగ్ జరిగిందని, చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలతో సీఐడీ రామోజీపైన ఏ1, ఆయన కోడలు, సంస్ధ ఎండీ శైలజపైన ఏ2 గా కేసులు నమోదుచేసింది. విచారణ కూడా మొదలైపోయింది. కేసులపై ఆల్రెడీ కోర్టులో విచారణ కూడా జరుగుతోంది.





విచారణలో భాగంగా ఈరోజో రేపో వీళ్ళపైన తీవ్రమైన చర్యలు తప్పవనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. ఈ విషయంలోనే రామోజీలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తమపైన నమోదైన కేసులను కోర్టు విచారణలో తేల్చుకోవాల్సిన రామోజీ చాలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, ఎక్స్ ఆర్మీ అందరినీ  తనకు మద్దతుగా రక్షణగా పిలుచుకుంటున్నారు. పైన చెప్పిన వాళ్ళతో సమావేశాలు ఏర్పాటుచేయించి జగన్మోహన్ రెడ్డి, సీఐడీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు.





ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడితే మాత్రం రామోజీకి జరిగే ఉపయోగం ఏమిటి అనేదే ప్రశ్న. కేసులు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నది సీఐడీ. విచారణ జరుగుతున్నది కోర్టులో. కాబట్టి రామోజీ అయినా శైలజ అయినా నిర్దోషులుగా బయటపడాల్సింది కోర్టులోనే. బయట ఎంతమంది ఎన్ని సమావేశాలు పెట్టుకుని క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చినా ఎలాంటి ఉపయోగముండదని రామోజీకి  తెలియదా ?





దశాబ్దాలుగా మార్గదర్శిలో రామోజీ చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలు, మోసాలు అన్నీ బట్టబయలైనట్లు సీఐడీ చెబుతోంది. ఒకవైపు రామోజీ చట్టాన్ని ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నట్లు సీఐడీ చెబుతోంది. ఇదే సమయంలో తాను చట్ట విరుద్ధంగా వ్యాపారం చేయలేదని ఇంతవరకు రామోజీ ఎక్కడా చెప్పలేదు. ఎంతసేపు తనమీద ఎవరు ఫిర్యాదులు చేయలేదు, ఖాతాదారులకు కరెక్టుగా డబ్బులిచ్చేస్తున్నానే సొల్లు కతలే చెబుతున్నారు. చేస్తున్న వ్యాపారం అక్రమమా ? సక్రమమా ? అని చెప్పమంటే ఆ విషయం మాట్లాడటంలేదు. ఈ నేపధ్యంలో ఎంతమంది మద్దతుగా మాట్లాడితే మాత్రం ఉపయోగమేమిటి ?



మరింత సమాచారం తెలుసుకోండి: