రామచంద్రాపురంలో ఆసక్తికర రాజకీయ నడుస్తుంది. అక్కడ సామాజికవర్గాల లెక్కలన్నీ పరిశీలించిన జగన్ పార్టీ.. ఈసారి శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన పిల్లి సూర్యప్రకాశ్‌కు టికెట్‌ ని కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందినవాడు.అయితే నియోజకవర్గ బదిలీల్లో మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కి పంపింది వైసీపీ హైకమాండ్‌. అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు శెట్టిబలిజలకు సీట్లు ఇచ్చిన వైసీపీ సమరానికి సిద్ధమనే సంకేతాలు పంపింది. అందువల్ల ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.గత ఎన్నికల్లో పార్టీల నిర్ణయాలను కనుక పరిశీలిస్తే ఒక పార్టీ శెట్టి బలిజలకు ఛాన్స్ ఇస్తే.. మరో పార్టీ కాపులకు సీటు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష కూటమి నుంచి కాపు నేతలే బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే టీడీపీ-జనసేన కూటమి ఈ ఈక్వేషన్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌కు దారితీస్తోంది. ఎందుకంటే ఈ రెండు పార్టీల నుంచి రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువే ఉంది.


టీడీపీలో రెడ్డి సుబ్రహ్మణ్యం, కాదా వెంకటరమణ టికెట్‌ ఆశిస్తుండగా, ఈ ఇద్దరు శెట్టిబలిజ సామాజికవర్గ నేతలు కావడంతో కూటమి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక ఇదే సీటును ఆశిస్తూ కాపు నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు రేవు శ్రీను తాజాగా టీడీపీలో చేరడం జరిగింది. దీంతో రామచంద్రాపురం సీటుపై టీడీపీలోనే ముగ్గురు నేతల మధ్య పోటీ ఉండనుంది.జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు పోటీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మొత్తం 5 మంది నేతలు రామచంద్రాపురంలో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ 5 మందిలో ఇద్దరు శెట్టి బలిజ సామాజివర్గం నేతలు అయితే మిగిలిన ముగ్గురు కాపు సామాజికివర్గానికి చెందిన వారు. వైసీపీ శెట్టి బలిజలకు ఛాన్స్ ఇచ్చినందున టీడీపీ-జనసేన కూటమి కాపులకు చాన్స్‌ ఇవ్వాలనుకుంటే ముగ్గురి మధ్యే పోటీ ఉంటుంది. ఈ ముగ్గురిలో ఒకరు టీడీపీ అయితే, మిగిలిన ఇద్దరు జనసేన నేతలు. ఐతే పొత్తుల్లో ఈ సీటు ఏ పార్టీకి యిస్తారనేది కూడా ఇక్కడ ప్రధానాంశమే.ఈ రామచంద్రాపురం ఎమ్మెల్యేని నిర్ణయిస్తున్న రెండు ప్రధాన సామాజికవర్గాల్లో ఎవరిని ఎంచుకుంటారనేది మాత్రమే ఉత్కంఠకు దారితీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: