కేవలం పార్టీలో చేరడం మాత్రమే కాదండోయ్.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ ఆలోచన మనసులో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయాల గురించి చర్చించినట్లు కూడా సమాచారం.అయితే చంద్రశేఖర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన మాల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అదే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పగా సీటు నీకే కన్ఫార్మ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డియే పోటీ చేస్తారని ఆయనకు సీటు ఖరారైందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇదే కనుక నిజం అయితే అల్లు అర్జున్ మామ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి