ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని ఓకేత్తయితే నందిగామ నియోజకవర్గ రాజకీయాలు మరో ఎత్తు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ  భారీ ఎత్తున పోటీ ఏర్పడింది.  ఏ నియోజకవర్గంలో అయినా ఇద్దరు నేతల మధ్య పోటీ ఉంటుంది.కానీ ఈ నియోజకవర్గంలో మొత్తం ఆరుగురు నేతల మధ్య పోటీ ఏర్పడింది.  ఇందులో వైసీపీ నుంచి ముగ్గురు బిగ్ లీడర్లు ఉండగా టిడిపి నుంచి ముగ్గురు బిగ్ లీడర్లు ఉన్నారు. మరి ఈ టిడిపి కంచుకోటలో  వైసిపి మళ్లీ జెండా పాతుతుందా.. లేదంటే వైసీపీని తలదన్ని టీడీపీ మరోసారి గద్దనెక్కుతుందా..ఎవరి బలం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడగా ఇది కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది.  ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ హవా నడిచింది. టిడిపి పార్టీ ఏర్పడిన తర్వాత 1989 లో  ఒక్కసారి కాంగ్రెస్ మినహా, మరోసారి వైసిపి మినహా మిగతా అన్ని ఎన్నికల్లో టిడిపి గెలిచింది.

 అయితే ఈ ఎన్నికల్లో మరోసారి టిడిపి, వైసిపి మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో పోరు జరుగుతుంది.  అలాంటి ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి.  వీటిలో అత్యధికంగా బీసీ ఓట్లు ఉండగా, దాని తర్వాత మాదిగల ఓట్లు కీలకం. ఇక కమ్మ, కాపు ఓట్లు కూడా 30 వేల లోపు ఉన్నాయి. అలాంటి ఈ నియోజకవర్గంలో కమ్మ నాయకులదే హవా నడిచేది. ఎప్పుడైతే ఎస్సీ నియోజకవర్గంగా మారిందో అప్పటినుంచి మాదిగలకు ప్రాధాన్యతిస్తూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి  మొండితోక జగన్మోహన్రావు పోటీ చేశారు. టిడిపి కంచుకోటలో మొండితోక విజయకేతనం ఎగరవేశారు. దీంతో ఈయనకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్  ఆయన సోదరుడు అరుణ్ కుమార్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.  దీంతో గత ఐదేళ్లుగా నందిగామలో తిరుగులేని లీడర్లుగా ఈ ఇద్దరు ఎదిగారు.  ఇదే తరుణంలో మరోసారి ఈ ఎన్నికల్లో  వైసిపి జగన్ కి మరోసారి టికెట్ కేటాయించింది. టిడిపి నుంచి  మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కు ఛాన్స్ ఇచ్చింది.

ఈమె గెలుపు బాధ్యతలను  నందిగామలో ఎంతో పేరుగాంచిన సీనియర్ లీడర్ మాజీ మంత్రి దేవినేని  ఉమాకు అప్పగించింది. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో దేవినేని ఉమాతో పాటు  వసంత నాగేశ్వరరావు కుటుంబం కూడా టిడిపిలో చేరడంతో  సౌమ్యకు భారీ పట్టు ఏర్పడిందని చెప్పవచ్చు. వీరంతా కలిసి నియోజకవర్గంలో ప్రచారం చేస్తు ఈసారి పసుపు జెండా ఎగరబోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీలో మొండితోక బ్రదర్స్ తో పాటు  విజయవాడ ఎంపీ కేసినేని నాని  కలిసి తీవ్రమైన ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈసారి మేమే గెలుస్తామని టిడిపిని, ఇక్కడ బొంద పెడతామంటూ వారు ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా అటు ముగ్గురు ఇటు ముగ్గురు  లీడర్ల మధ్య ఉత్కంఠ ఫైట్ ఏర్పడింది. ఈ ఫైట్ లో ప్రజల అభిప్రాయం ఏ పార్టీ  వైపు ఉన్నదనేది ఆసక్తికరంగా మారింది. ఎవరు గెలిచినా కొద్దిపాటి తేడాతోనే గెలుస్తారనేది  నియోజకవర్గ పరిస్థితి చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: