నందమూరి నటసింహం బాలకృష్ణ పార్టీ ప్రచారాల్లోకి దిగాడు. దిగడం దిగడమే తన వాడి, వేడిని చూపిస్తూ వైరల్ అవుతున్నాడు. దానితో సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అంతటా బాలకృష్ణ పేరు మారుమోగిపోతుంది. తాజాగా బాలయ్య ... అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయన "వై సీ పీ" ప్రభుత్వంపై , ఆ ప్రభుత్వ వైఖరిపై విమర్శలను చేశారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే అని కచ్చితంగా కూటమి అధికారములోకి వస్తుంది అని నేతలు , కార్యకర్తలు ఆ విషయంలో ఏ మాత్రం టెన్షన్ పడకూడదు అని బాలయ్య వారికి గట్టిదీమా ఇచ్చాడు. అలాగే రాబోయే ఎన్నికల్లో "వై సీ పీ" పార్టీ ఫ్యాను రెక్కలు విరిగి నేలపై పడతాయి అని బాలయ్య స్పష్టం చేశాడు. జగన్ మాట తప్పను అంటూ ఈ రాష్ట్రం మెడలు విరిచేసాడు.

అధికారంలోకి వచ్చే ముందు దళితులకు అండగా ఉంటాను అని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ దళితులను హత్య చేస్తున్నాడు అని అతనిపై మండిపడ్డారు. ఇసుక అమ్ముకొని ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నావని బాలయ్య... జగన్ నీ ప్రశ్నించారు. అలాగే జే బ్రాండ్ పేరుతో అక్క , చెల్లెమ్మల తాళిబొట్లు తెంపుతున్నావని బాలయ్య, జగన్ పై సీరియస్ అయ్యారు. ఇవి మాత్రమే కాకుండా ఎస్సీ , ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలు రద్దు చేసి దళిత ద్రోహిగా సీఎం మారినట్లు బాలయ్య చెప్పుకొచ్చారు.

అలాగే అమరావతి రాజధాని కావాలని ఉద్యమించిన వారిపై ఎస్సీ , ఎస్టీ కేసులు పెట్టించారని ... ఒక దళిత డ్రైవర్ ను.. ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ పార్టీ కి దక్కుతుందని బాలయ్య అన్నారు. నిరుద్యోగులకు ఎస్సీ , ఎస్టీ ప్లాన్లను విడుదల చేసి వారికి ఆనందాన్ని కలగజేసింది చంద్రబాబు నాయుడు అని... మళ్లీ చంద్రబాబు వస్తేనే నిరుద్యోగులకు, పేదలకు, రైతులకు ఆనందం కలుగుతుంది అని... మీ అమూల్యమైన ఓటు కూటమికి వేసి మళ్లీ చంద్రబాబు నాయుడు పాలన తేవాలి అని తాజా సభలో బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: