నాన్న పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది అనే రజనీకాంత్ సినిమాలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే  ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయాలలో ఈ డైలాగ్ బాగా వినిపిస్తుంది. ఎందుకంటే టిడిపి పార్టీ జనసేన, బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి. అధికారంలో ఉన్న జగన్ ను గద్దె దింపేందుకు పావులు కడిపాయ్. కానీ జగన్ మాత్రం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గానే బరిలోకి దిగుతున్నార. దీంతో వైసిపి నేతలు అందరూ ప్రచారంలో ఇదే డైలాగ్ తో కూటమి పార్టీలకు కౌంటర్లు ఇస్తూ వచ్చారు.

 ఇక ఇప్పుడు ప్రచారానికి డెడ్ లైన్ ముగియడంతో.. అంతట ప్రచార హడావిడి ముగిసింది. దీంతో ఇక ఎవరు గెలవబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మే 13వ తేదీన జరగబోయే పోలింగ్లో  ఏపీ ఓటర్లు ఈసారి ఎవరికీ పట్టం కట్టబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటివరకు ఏపీ రాజకీయాలపై బయటికి వచ్చిన రిపోర్టులు చూసుకుంటే మరోసారి ఇక జగన్ సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడు అన్నది తెలుస్తోంది. వైసిపికి మరోసారి భారీ మెజారిటీ రావడం ఖాయమని సర్వే రిపోర్ట్ లు చెబుతున్నాయి.


 ఇలా ఏపీ ప్రజలు జగన్కు అనుకూలంగా ఉండడానికి కారణం వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే నట. దాదాపు ఏపీలోని 90 శాతం మంది వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలలో ఏదో ఒక పథకంతో లబ్ధి  పొంది ఉన్నారట. మరి ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్ రూపురేఖలను మార్చడం.. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి నాణ్యమైన విద్యను అందించడం.. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ఉద్దేశంతో పథకాలను తీసుకురావడం జగన్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ రాజకీయ ఉద్దండుడు అనే పేరు  సాధించినప్పటికీ.. ఇప్పుడు ఎన్నికల్లో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఇక మరోసారి చంద్రబాబుకు షాక్ తప్పేలా లేదని తెలుస్తుంది. ఈసారి కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యే చాన్సులే ఎక్కువగా ఉన్నాయని టాక్ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తుంది. మరి ఓటర్లు ఏం నిర్ణయించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: