తెలంగాణలో ఇటీవల 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రచార వేడి తగ్గినప్పటికీ అభ్యర్థులు అందరిలో మాత్రం కొత్త టెన్షన్ మొదలైంది. ఫలితాలలో ప్రజలు ఎవరి వైపు నిలిచారు అన్న విషయం తేలబోతుంది. దీంతో ప్రజలు తమ భవితవ్యాన్ని ఎలా నిర్ణయించారు అని అందరూ టెన్షన్ పడుతున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ ఎన్నికలు అటు అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.


 ఎందుకంటే కనుమరుగవుతుంది అన్న దశ నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని ఛేజిక్కించుకుంది హస్తం పార్టీ. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి దీనికోసం చాలానే కష్టపడ్డారు. పార్టీలోని కీలక నేతలు అందరిని కూడా కలుపుకుంటూ ఇక అభ్యర్థులు అందరి తరపున కూడా ముమ్మర ప్రచార నిర్వహించారు. దీంతో తమకు డబల్ డిజిట్ స్థానాలలో విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.


 కానీ అటు ఇంటర్నల్ పాలిటిక్స్ లో వినిపిస్తున్న మాటలు చూస్తే మాత్రం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి కాదు మరో పార్టీకి రాబోతుంది అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఆ పార్టీ ఏదో కాదు బిజెపి. ఎందుకంటే అటు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ కు మెజారిటీ రాకుండా ఉండేలా లక్ష్యాన్ని పెట్టుకుంది. తాము ఓడిపోయిన పర్వాలేదు కానీ అటు కాంగ్రెస్కు మెజారిటీ వస్తే మాత్రం ఇక గులాబీ పార్టీకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అని అనుకుందట. దీంతోబలహీనమైన అభ్యర్థులు ఉన్నచోట కారు గుర్తు గెలవకపోయినా పరవాలేదు కానీ కాంగ్రెస్ గెలవద్దు అనే నేతలుప్రచారం చేశారట. దీంతో ఇక కారు పార్టీ కూడా కమలం వైపు ఉండడం మరోవైపు ఇక కేంద్రంలోని కీలక నేతలు అందరూ కూడా తెలంగాణ వచ్చి ప్రచారం చేయడం.. బిజెపి తరఫున బలమైన అభ్యర్థులు నిలబడటం.. ఇలా అన్ని కలుపుకొని అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అటు  కమలం పార్టీకి మెజారిటీ స్థానాలలో గెలుపు వరించబోతుంది అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కింది స్థాయిలో ఉండే బిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు అందరూ కూడా ఇదే చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: