ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మాచర్ల లోని పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసులు కూడా నమోదయ్యేలా చేశారు. ఈ విషయం పైన హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారు. వీటిలో హత్యాయత్నంతో పాటు దాడులు కేసులు ఉండడంతో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.


ఈ రోజున ఇందుకు సంబంధించి విచారణ కూడా జరిగింది. పిన్నెల్లి పైన దాఖలైన మూడు కేసులలోను ముందస్తు బెయిల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కోర్టు. పోలింగ్ రోజున మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మకమైన ఘటనలో పిన్నెల్లి పాత్ర పైన పోలీసులు పక్క ఆధారాలు సేకరించి మూడు కేసులు సైతం నమోదు చేశారు. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా పలు రకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ పొందిన పిన్నెల్ని మరో మూడు కేసులలో అరెస్టు చేస్తే కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు నేతలు పక్కా ప్లాన్ తోనే ఇలాంటివి చేయించారు.


అయితే ఈ విషయాల పైన వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పుని రిజర్వ్ చేసింది.కొద్దిసేపటి క్రితమే పిన్నెల్ని  బేయిల్ పైన దాఖలైన మూడు కేసులలోను ముందస్తు  బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. దీంతో కౌంటింగ్ వేళా ఆయనకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా పోయింది. ఇప్పటికే అరెస్టు భయంతో మాచర్ల బయట ఉంటున్న ఆయన తిరిగి స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రేపు మాపో ఆయన తిరిగి మళ్ళీ మాచర్లకు రాబోతున్నారు. అయితే అక్కడ మహిళలు మాత్రం ఈయనకు అండగా ఉంటూ సపోర్టు చేస్తున్నారు. కమ్మ కులస్తుల వాళ్లే ఎస్సీ ఎస్టీ మహిళల పైన వైసీపీకి ఓటు వేశామని ఉద్దేశంతోనే దారుణాలు చేస్తూ ఉన్నారని వీడియో కూడా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: