వంశధార ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం

వంశధార ప్రాజెక్టుకు 2005లో శ్రీకారం

ఇరు రాష్ట్రాల ఒప్పందంతో వంశధార ప్రాజెక్టు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు... రానున్న నేపథ్యంలో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే... ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన.. రైతుల బాగోగులు, సామాన్య ప్రజల కష్టాలను తీర్చాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే... వంశధార ప్రాజెక్టుపై  ఫోకస్ పెడితే... ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుంది.

ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు... నీరు అందించేందుకు వంశధార ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి ఇప్పటికే దాదాపు 200 కోట్ల బడ్జెట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ పనులు మందకోడిగానే సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అలాగే తాగునీరు అందుతుంది. గొట్ట బ్యారేజీ నుంచి హీరా మండలం రిజర్వాయర్ లోకి నీటిని తరలించే వంశధార ఎత్తిపోతల పథకం ద్వారా రెండు జిల్లాలలో కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయానికి నోచుకోని భూములు... సాగులోకి వస్తాయని చెబుతున్నారు అధికారులు.

ఇరు రాష్ట్రాల ఒప్పందంతో వంశధార ప్రాజెక్టు

మినాజులా వద్ద వంశధార నదిపై ప్రాజెక్టు నిర్మించి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ అలాగే ఒడిశా రాష్ట్రాలు సాగునీరు అలాగే తాగునీరును వినియోగించుకోవాలి. ఇది గతంలో జరిగిన ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొట్టా బ్యారేజ్ నుంచి నీటి వినియోగం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే వంశధార ప్రాజెక్టు పూర్తి కావడానికి చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిస్సా  రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ రాష్ట్రాల మధ్య... సమస్యను కొలిక్కి తెచ్చే ప్రభుత్వం వస్తే... వంశధార ప్రాజెక్టు పూర్తి అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేసిన...ఫలితం రాలేదు.

వంశధార ప్రాజెక్టుతో 2.5 లక్షల ఎకరాలకు నీరు  

వంశధార ప్రాజెక్టు ద్వారా అధికారిక లెక్కల ప్రకారం.. 2.5 లక్షలు ఎకరాలకు నీరు అందించవచ్చు. వంశధార ప్రాజెక్టుపై నేరేడు బ్యారేజ్ నిర్మించడం ద్వారా నదీ జలాలను ఏపీ అలాగే ఒడిస్సా రాష్ట్రాలకు సమంగా వినియోగించుకునేలాగా  57.5 టిఎంసిల చొప్పున వంశధార ట్రిబ్యునల్ కేటాయింపులు కూడా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కేంద్ర జలవరణంల శాఖ అధికారులు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. కానీ ఈ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాబట్టి ఏపీలో వంశధార ప్రాజెక్టు పూర్తి చేస్తేనే... ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని... అలా మేలు చేసే ప్రభుత్వం రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: