యంగ్ బ్యూటీ ఫరియ అబ్దుల్లా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక మొదటి మూవీ తోనే మంచి హిట్ అందుకున్న ఈమె ఇటీవలే‌ ఆ ఒక్కటి అడక్కు చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.

ఇక ఈ మూవీల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన అందలతో ఫ్యాన్స్ ని ‌ ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫరియాకు బర్తడే విషెస్ తెలిపారు చాలామంది అభిమానులు.

ఇందుకు సంబంధించిన పోస్ట్లు షేర్ చేస్తూ.." నాకు విషెస్ తెలిపినందుకు మీ అందరికీ థాంక్స్. కానీ ఈ విషెస్ ను జూన్ 21వ తేదీకి చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నా బర్తడే కాదు " అంటూ ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ ఫరియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె పోస్ట్ ని చూసిన పలువురు.. " నీ బర్తడే నేడు అనుకుని మేము పప్పులో కాలేశాము.

బర్తడే విషెస్ తెలియజేసిన వారందరికీ పెద్ద షాక్ ఇచ్చారు కదా? పోనీలే అడ్వాన్స్ హ్యాపీ బర్తడే. ముందే చెప్పాము అనుకోండి " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ పర్యా అబ్దుల్లా ఎటువంటి సినిమాలోని నటించడం లేదు. ఈమె హైట్ ని చూసి పెద్దగా డైరెక్టర్లు ఈమెకి అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే అడపాదడపా వెబ్ సిరీస్లో నటిస్తుంది ఫర్యా అబ్దుల్లా. మరి రానున్న రోజుల్లో అయినా ఈ బ్యూటీ కి ఏ డైరెక్టర్ అయినా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: