టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎంతో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా, ఓటుకు ఎన్ని వేలైనా ఇవ్వగల సామర్థ్యం ఉన్నా గతంలో పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మరి ఈసారైనా గెలుస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ గెలవకపోతే అతని రాజకీయ భవిష్యత్తు గాఢాంధకారంగా మారే అవకాశం ఉంది. ఈసారి ఈ నేత చాలానే కష్టపడ్డారు. డబ్బులు కూడా బాగానే పంచిపెట్టారు. ప్రతి ఓటర్ ను కలిశారు. ఇంత చేసి ఓడిపోతే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పూర్తిగా పోయే అవకాశం ఉంది.

అయితే మూడు శాఖల మంత్రిగా నియమితులైన తర్వాత కూడా మంగళగిరికి లోకేష్ చేసింది ఏమీ లేదు అంటూ రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఆయనను ఈసారి కూడా ప్రజలు ఓడగొట్టే ఉంటారని అంచనా వేస్తున్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్ ను 5000 కంటే ఎక్కువ ఓట్లతో ఓడించారు. ఈ ఓటమి తర్వాత ఈ నారావారి అబ్బాయి  తప్పులను సరిదిద్దుకొని పొలిటికల్ స్ట్రాటజీలతో ముందడుగు వేశారా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ నియోజకవర్గంలో లోకేష్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడంలో ఫెయిల్ అయ్యారని అంటున్నారు.

వైసీపీ లోకేష్‌ను ఓడించడానికి స్థానికురాలైన మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. ఆమె మంచి విద్యావంతురాలు. ఇక్కడ ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అదే సామాజిక వర్గం లావణ్య కావడం వల్ల ఆమె గెలుపు అవకాశాలు పెరుగుతాయి. చాలా రాజకీయ నేపథ్యం ఉండి, స్థానికరాలు కావడం ఈమెకు మరొక ప్లస్ అని చెప్పవచ్చు. లావణ్య తండ్రి, బంధువులు అందరూ కూడా వైసీపీలో మంచి రాజకీయ హోదాల్లో ఉన్నారు. వారి సహాయంతో ఈమె సోషల్ ఇంజనీరింగ్ విషయంలో టీడీపీపై పై చేయి సాధించింది.

జగన్ మంగళగిరి, తాడేపల్లిని కలిపి ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. రూ.130 కోట్లను గ్రాంట్ గా రాసిచ్చారు. గౌతమ బుద్ధ రోడ్డును డెవలప్ చేశారు. ఏకంగా తొమ్మిది అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. వైఎస్ఆర్ క్రీడా ప్రాంగణాన్ని కూడా డెవలప్ చేశారు. రహదారులను విస్తరించారు. కులాలకు అతీతంగా చాలామందికి భవనాలను కట్టించారు. పెళ్లి మండపాలను కూడా నిర్మించారు. ఇక ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు వేయించారు. ఇంకా అన్ని విధాలా అన్ని సామాజిక వర్గాలను ఆదుకున్నారు. మంగళగిరిలో వైసీపీ చేసిన అభివృద్ధిలో టీడీపీ 10 పర్సెంట్ కూడా చేయలేకపోయింది. లోకేష్ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చారే తప్ప ఆ నియోజకవర్గ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదు. ఈసారి ఆయన రాజకీయ వ్యూహం అసలు వర్కౌట్ కాలేదని సొంత పార్టీ నేతలే నిరాశ వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేతల అభిప్రాయం ప్రకారం లోకేష్ ఈసారి కూడా ఓడిపోవడం ఖాయం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: