టీడీపీ అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయంగా వేసే ఎత్తులు  ఎవ‌రికీ అర్ధం కావు. రాజ‌కీయంగా మేలు చేసే ప‌రిస్థితి ఉంటే.. ఆయ‌న అడుగులు బిన్నంగానే ఉంటాయి. ఈ విష‌యంలో ఎలాంటి వెనుక‌డు కూడా ఆయ‌న వేయ‌రు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ‌.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రిని వినియోగించుకోవ‌డ‌మే. కూట‌మి పార్టీల ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబును ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటున్న‌ట్టు పురందేశ్వ‌రి ప్ర‌క‌టించ‌డం నుంచి ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేవ ర‌కు కూడా.. పురందేశ్వ‌రి కీల‌క పాత్ర పోషించారు.


వాస్త‌వానికి 2004-2014 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబుపై ఒంటికాలిపై లేచారు పురందేశ్వ‌రి అప్ప‌ట్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పైగా మంత్రిగా కూడా ప‌నిచేశారు. దీంతో చంద్ర‌బాబును అదే ప‌నిగా టార్గెట్ చేశారు. అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పార్టీ మారి బీజేపీలో చేరారు. ఈ నేప‌థ్యంలోనే 2014లో టీడీపీతో బీజేపీ చేతులు క‌లిపింది. అప్ప‌ట్లో రాజంపేట నుంచి పురందేశ్వ‌రి పోటీ చేశారు. కానీ, టీడీపీతో క‌ల‌వాల్సి వ‌చ్చే స‌రికి ఒకింత ఇబ్బందిగానే ఆమె ఫీల‌య్యారు.


కానీ, ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజ‌మండ్రి నుంచి పోటీ చేయాల్సి రావ‌డం.. ఇక్క‌డ టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉండ‌డంతో ఆమె త‌న మ‌న‌సు మార్చుకుని టీడీపీతో అంకిత భావం ఉన్న నాయ‌కురాలిగా క‌లిసిపోయారు. ఇలా చేయ‌డంలో చంద్ర‌బాబు చ‌తుర‌త ఖ‌చ్చితంగా వ‌ర్క‌వుట్ అయింది. దీంతో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తిస్తూ.. పురందేశ్వ‌రి ప్ర‌క‌టన అంద‌రినీ ఆక‌ర్షించింది. గ‌తంలో అంటే.. 1995లో తొలిసారి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయినప్పుడు కూడా.. చంద్ర‌బాబుకు ద‌గ్గుబాటి కుటుంబం స‌హ‌క‌రించింది.


ఆనాడు అన్న‌గారు ఎన్టీఆర్ వ్య‌వ‌హార శైలితో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు త‌న‌కు వ‌రుసకు సోద‌రుడు అయ్యే.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావును త‌న‌తో క‌లుపుకొన్నారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు. దీంతో చంద్ర‌బాబుకు ద‌గ్గుబాటి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఫ‌లితంగానే అప్ప‌ట్లోనూ ద‌గ్గుబాటి... చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిగా పేర్కొంటూ ఏక‌గ్రీవంగా తీర్మానం చేశారు. అలా అప్ప‌ట్లో ద‌గ్గుబాటిని, ఇప్పుడు పురందేశ్వ‌రిని త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: