ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం టీవీల్లో, సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో ఎక్కడా చూసిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేర్లే వినిపిస్తున్నాయి. ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ ను వెంటేసుకొని తిరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.  సొంత కొడుకు కంటే ఎక్కువగా తనను గౌరవిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కెరియర్ ను మొత్తం చంద్రబాబు నాయుడు డిజైన్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది బాబుకు తప్ప ఇంకొకరికి మాత్రం అస్సలు తెలియదు. ఆయన పోటీ చేయడం నుంచి మొదలు పిఠాపురం వచ్చే వరకు ఎన్నో మలుపులు ఎన్నో ఆలోచనలు ఇవన్నీ చంద్రబాబు ఇచ్చినట్టే పవన్ నడుచుకున్నారట.

పవన్ భీమవరంలో పోటీ చేస్తానంటే, సర్వేలు చేయించి అక్కడ బాగా లేదని చెప్పి పిఠాపురం తీసుకువచ్చారు అక్కడ వర్మాను ఒప్పించి ఈయనకు సీటు ఇప్పించారు. కానీ కొంతమంది వ్యక్తులు పవన్ పిఠాపురంలో ఓడించడానికి తీసుకొచ్చారని విమర్శించారు. కానీ వర్మ కు అక్కడ ఎంతో పట్టుంది టిడిపి ఎలాగైనా గెలిచేది. కానీ వర్మాను పక్కన పెట్టించి పవన్ ను పంపించి అక్కడ సీఎం రమేష్ ను అటాచ్ చేసి,  కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకోరని కొంతమంది తీసుకుంటారని అన్నారు. ఆ తర్వాత హోం మంత్రి పదవి వస్తుందని కొందరు అంతేకాదు  మరో పదవి ఇస్తారని మరికొందరు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, అటవీ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలు కేటాయిస్తారని వార్తలు బయటకు వస్తున్నాయి. 

ఈ మూడు శాఖలు కాకుండా హోంశాఖ తీసుకుంటే మాత్రం  చాలా ఇబ్బందులు ఉంటాయి. ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏం జరిగినా హోం శాఖ పరిధిలోకే వస్తుంది. అప్పుడు జగన్ ను ఏ విధంగా టార్గెట్ చేశారో, ఇప్పుడు పవన్ ను కూడా ఆ విధంగానే టార్గెట్ చేసి మాట్లాడుతారు. అందుకే పవన్ కు హోంశాఖ కాకుండా గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన శాఖలు ఇస్తే ఎప్పుడు జనాల్లో ఉంటూ, ఢిల్లీకి వెళ్లి స్కీములు పథకాల గురించి సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు జనాల్లో పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది.  ఇలా  బాబు ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి వస్తే మాత్రం. లొకేష్ న్ కూడా  ఎక్కువగా జనాల్లో తిరిగే శాఖనే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరిద్దరిని జత చేసి జనాల్లోకి పంపిస్తే లోకేష్ కు కూడా మరింత క్రేజ్ పెరుగుతుందని,  జనాల్లో ఇంట్రాక్ట్ కాగలుగుతాడని టెక్నిక్ తో చంద్రబాబు ఇలా చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: