ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సైతం టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్నాయి.. దీంతో ఏకంగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీ పార్టీ ఈ ఎన్నికలలో చాలా ఘోరమైన పరాజయాన్ని సైతం ఎదుర్కొన్నది. 175 స్థానాలలో గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకి పరిమితమైంది. దీంతో ఒక్కసారిగా అటు నేతలు అధిష్టానం కార్యకర్తల సైతం ఆశ్చర్యపోయారు. చాలా మంది నేతలలో కూడా కాస్త అసహనం కనబడింది అనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా వైసిపి పార్టీ ఓడిపోవడానికి వైసిపి నేతలే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతలను సైతం పిలిచి మరి పరామర్శించారు. ఈ క్రమంలోనే వైసిపి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా అనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చాలా మంది టీడీపీలోకి చేరుతారని వార్తలు వైరల్ గా చేశారు.. తాజాగా ఇలాంటి రూమర్స పైన వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను పార్టీ మారుతున్నారని విషయాల పైన జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ కర్నూలు జిల్లా ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరుపాక్షి ఈ విషయాన్ని సైతం ఖండించారు.


వైసిపి టికెట్ పైన గెలిచి టిడిపిలోకి వెళ్లేందుకు తన ఆత్మ సాక్షి ఎలా ఒప్పుకుంటుందని తాను పార్టీ మారడం లేదంటూ వెల్లడించారు. వైయస్సార్ ఆశయాల కోసమే జగన్ పట్టుదలన చూసి వైసిపిలోకి చేరానని జగన్ తన ఎమ్మెల్యేగా నిలబెట్టి మరి గెలిపించాలని ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తాము కానీ పార్టీ మారమంటూ వెల్లడించారు ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఇలాంటి వదంతులు ఎవరూ కూడా నమ్మవద్దండి అంటూ తమ అభిమానులను కార్యకర్తలను సైతం తెలియజేశారు. ప్రస్తుతం వైసిపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వైసిపి అభిమానులైతే ఆనంద పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మరి చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: