ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజుల నుంచి వివాదాస్పదంగా మారింది రుషికొండ ప్యాలెస్.. ఈ విషయం పైన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఎవరిని అడిగి ఈ రుషికొండ ప్యాలెస్ తాళాలు ఓపెన్ చేశారని ప్రభుత్వం ఈ విషయంలో ఏదైనా నిర్ణయానికి రాకముందే ఈ అత్యుత్సాహం ఏంటి అంటు కేవలం మీడియాని వెంటబెట్టుకొని మరి గంటా శ్రీనివాస్ ఇలాంటి హడావుడి చేయవలసిన అవసరం ఏముంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం వెనుక ఒక పెద్ద కథ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.


గడచిన  ఐదేళ్ల నుండి రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పైన ఒక్కసారి కూడా స్పందించని గంటా శ్రీనివాస్ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు వైసిపి చేసిన ఎలాంటి విషయాల పైన కూడా అసలు ప్రశ్నించలేదు. చంద్రబాబు నాయుడు రుషికొండ పర్యటనకు వస్తే గంట ఆయనతో పాటు అసలు వెళ్ళలేదు.. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు హడావిడి చేస్తున్నారనే అనుమానాలు కూడా పలువురు నేతలలో మొదలెత్తాయి. ముఖ్యంగా రుషికొండ పర్యటనలో భాగంగా కాలేజీలను ధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది.టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు సూచనలతో ఇందులో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కానీ గంట మాత్రం ఎప్పుడు ఈ విషయం పైన ఎక్కడ స్పందించలేదు... అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారితో కలిసి ఈ ప్యాలెస్ వ్యవహారాలను బయటపెట్టాలని భావించినప్పటికీ.. గంట చేసిన ఈ అత్యుత్సాహం వల్ల ఈ విషయం మొత్తం పక్కదారి పట్టించేలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గంటా చేసిన ఈ మీడియా అత్యుత్సాహం వల్ల ఆయనకే బెడిసికొట్టేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: