గతంలో హీరోయిన్ గా రెండు మూడు చిత్రాలలో నటించిన నటి శ్రీరెడ్డి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ తో వివాహం జరగబోతుందనే విషయం గత రెండు రోజుల నుంచి వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయం పైన తాజాగా శ్రీరెడ్డి స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.


నటి శ్రీరెడ్డి కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటిగా పేరుపొందింది. దీంతో ఈమెకు సినిమా ఆఫర్లు కూడా లేకుండా చేయడమే కాకుండా చాలామంది నిర్మాతల కుమారులు మహిళలను కూడా లైంగికంగా వాడుకుంటున్నారని ఆరోపణలను కూడా చేయడంతో అప్పట్లో శ్రీరెడ్డి పేరు సంచలనంగా మారింది. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని సైతం విపరీతంగా ఆడేసుకుంటూ ఉంటుంది. నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయాన్ని నిర్భయంగా చెప్పేస్తూ ఉంటుంది. తాజాగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించడంతో ఈ ప్రచారానికి సైతం శ్రీరెడ్డి పుల్ స్టాప్ పెట్టింది.


శ్రీ రెడ్డి మాట్లాడుతూ గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. కానీ తనని పెళ్లి చేసుకుంటానని ఏనాడు చెప్పలేదు.. ఇదంతా కేవలం ఫేక్ ప్రచారమే అసలు ఆ అబ్బాయితో తాను ఏనాడు కూడా రిలేషన్ షిప్ లో లేనని గతంలో బైరెడ్డి బాగుంటాడని అలాంటివాడు మొగుడుగా వస్తే బాగుంటుందని సరదాగా చెప్పానని.. కానీ తాను ఎప్పుడు సిద్ధార్థ రెడ్డిని అలా చూడడం కానీ అతనితో ఫోన్ మాట్లాడడం కానీ చేయలేదంటూ తెలిపింది. కేవలం తమ గురించే గిట్టని వాళ్ళే ఇలాంటి రూమర్స్ ప్రచారం చేస్తున్నారని అయినా పర్వాలేదు కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి అతను చిన్న పిల్లాడు అని రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు అంటూ వెల్లడించింది. అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: