తెలంగాణ బీజేపీ పార్టీ లో సంక్షోభము నెలకొంది. బీజేపీ శాసనసభా పక్షానికి, పార్టీకి మధ్య గ్యాప్ ఉందన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీకి కనీసం సమాచారం లేకుండానే ఎల్పీ నేతలు కొన్ని అంశాలపై స్పందిస్తున్నారని, ఒక్కోసారి పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్స్ ఉంటున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతుందట. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు కావాల్సినంత మెటీరియల్ పార్టీ వైపు నుంచి అందించలేదన్న విమర్శలు సైతం వచ్చాయి.
బీజేపీ శాసనసభ సభ్యులకు సొంతంగా ప్రిపేర్ అయ్యే వ్యవస్థ లేదని పార్టీ సిస్టమ్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే సభలో వారి పనితీరు బాగుంటుందని.... కానీ ఆ దిశగా సరైన సహకారం లేదన్నది ఎల్పీ వైపు నుంచి ఉన్న కంప్లైంట్ గా తెలుస్తోంది. ఇక ముఖ్యమైన అంశాలలో కొందరు బీజేపీ నాయకులు ప్రభుత్వం టార్గెట్ గా కాకుండా.... అందులోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారట. దాంతో పార్టీ ప్రయోజనాలను పర్సనల్ అజెండాకు ముడి పెడుతున్నారాన్న అనుమానాలు పెరుగుతున్నాయట.
మరోవైపు బీజేపీ పదాధికారుల సమావేశానికి ఒక ఎమ్మెల్యే మాత్రమే హాజరవ్వడం పార్టీ పెద్దలకు మింగుడు పడడం లేదట. అలాగే బిజెఎల్పీ సుంకిశాల పర్యటనకు వెళ్ళినప్పుడు అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నట్లు ఉన్నారు. మిగతావారు ఏమయ్యారంటే ఎవరి దగ్గర సమాధానం లేదట. మూడు రోజుల ముందే టూర్ ప్రోగ్రామ్ నిర్ణయం అయినా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అందరూ వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది.
పార్టీ ఆదేశంతోనే బిజేఎల్పీ సుంకిశాలకు వెళ్లిందని అనుకుంటున్న అసలు పార్టీ చెప్పిందా లేదా అన్నది క్లారిటీ లేదట. అంత ముఖ్యమైన కార్యక్రమంలోనే ఇంత సమాచార లోపం ఎలాగన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదంటున్నారు. పార్టీకి, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేదు. అలాగే ఎమ్మెల్యేల మధ్యనే ఒకరికి ఒకరికి కో ఆర్డినేషన్ లేదు. దింతో తెలంగాణ బీజేపీ పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి