
ఇప్పుడు కొత్తగా కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదులు, మేయర్‌కు లేఖలు అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఏమీ చేయలేకపోయారు. నలుగురు అటు, నలుగురు ఇటు మారినా చర్యలు లేవు. తిరుపతి ఉప ఎన్నికల్లో, మండల పరిషత్ ఎన్నికల్లో ఫిరాయింపులు జరిగినా ఫలితం లేదు. ఇప్పుడు మాత్రం పెద్ద యాక్షన్ తీసుకుంటారట. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
నైతికంగా ఇది తప్పు అని అందరికీ తెలుసు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు నైతికత అనే పదం వెనుకబడిపోయింది. జనం చీదరించుకుంటున్నా, రాజకీయ నాయకులు మాత్రం తమ దారిలో తాము వెళ్తున్నారు. వైసిపి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. కానీ గత అనుభవాలను బట్టి చూస్తే, ఈ సీరియస్ యాక్షన్ అనేది ఉత్తిదే అనిపిస్తుంది. ఎందుకంటే, ఫిరాయింపులు చేసిన వాళ్ళు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అసలు ఈ ఫిరాయింపుల పర్వం వెనుక అసలు కథ ఏంటి? రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే నాయకులు, ఇలాంటి చర్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చర్యలు తీసుకుంటామని ప్రకటనలు గుప్పించినా, ఆచరణలో మాత్రం శూన్యం ఎందుకు? ఇలాంటి రాజకీయ క్రీడలో ప్రజలు మాత్రం ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సిందేనా? వ్యవస్థలను ఉపయోగించి చర్యలు తీసుకోవడం చేతకాకపోతే, కనీసం నైతిక బాధ్యతతో రాజీనామా చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.