ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభం చేయడానికి స్పెషల్ గెస్ట్ గా మోడీని సైతం పిలిపించారు ఏపీ ప్రభుత్వం. దీంతో నేతలతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను, అమరావతి రైతులను, మోదీని సైతం ప్రశంసలతో కురిపించారు. సీఎం చంద్రబాబు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అమరావతి అంటే 5 కోట్ల మంది ఆంధ్రుల రాజధాని అని అయితే భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అదొక ఎమోషన్ అంటూ తెలియజేశారు.


రాజధాని కేవలం 58 రోజుల వ్యవధిలోని ఏకంగా 34 వేలకు పైగా రైతులు ఇచ్చారని.. ఏకంగా 29 గ్రామ ప్రజలు ఇలా చేయడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. 2019 లో వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు రాజధానుల వ్యవహారాన్ని సైతం అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేశారు ఏకంగా 1631 రోజులు సుదీర్ఘంగా కూడా ఉద్యమాన్ని కొనసాగించారని చివరికి వారి పోరాటం గెలిచింది అంటూ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీని మళ్లీ ఇప్పుడు గ్రాండ్గా రీస్టార్ట్ చేసింది కూడా ఆయనే అంటూ తెలిపారు.


ఈ సందర్భంగా రాజధాని రైతులను ప్రశంసిస్తూ ఉన్నారు ఐదేళ్లలో అమరావతి విధ్వంసం చూసిన రైతులు ఇక ముందట అభివృద్ధి చూస్తారంటూ తెలిపారు. రాబోయే మూడేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటూ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.ఐదేళ్లపాటు జరిగిన ఈ ధర్మ యుద్ధంలో అమరావతి రైతులదే విజయం  అంటూ కొనియాడారు. ఆ సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి ప్రజలు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు ఒక రాష్ట్ర అభివృద్ధిని ఇచ్చారంటూ వెల్లడించారు. రాజధాని కోసం తమ భవిష్యత్తుని ఇలా పణంగా పెట్టిన రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కూడా అండగానే ఉంటుందని తెలిపారు. ఇక నారా లోకేష్ కూడా ఎన్ని కుట్రలు చేసిన అమరావతిని ఎవరూ ఆపలేరని కూడా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: