పహల్గాం దాడికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన భారత్ గ‌త రాత్రి నుంచే పాకిస్తాన్ పై భీక‌ర‌మైన దాడుల‌కు దిగింది. ఈ దాడి లో జీవిత భాగ‌స్వాముల‌ను కోల్పోయిన మ‌హిళ‌ల క‌న్నీరు తుడిచేలా ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాకిస్తాన్ లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ ఆర్మీ త్రివిధ ద‌ళాలు భీక‌ర‌మైన దాడులు ప్రారంభించాయి. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ తో పాటు పాక్ లోని ప‌లు ఉగ్ర‌వాద శిబిరాల‌పై భార‌త్ మిస్సైళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. లష్కరే తయ్యబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బలు ముజాహిద్దీన్, ఇతర ఉగ్రసంస్థల స్థావరాలు టెర్రర్ నెట్వర్క్‌లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపు దాడులు మొద‌ల‌య్యాయి. పాక్ లోని బహావల్‌పూర్ - మురిద్కే -  కోట్లీ - గుల్‌పూర్ - సవాయ్ - సర్జాల్ - బర్నాలా - మెహ్‌మూనా ప్రాంతాలపై దాడులు జ‌రిగాయి.


ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం జాతీయ మీడియాలో వ‌స్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం 80 మంది పాక్ ఉగ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్టు స‌మాచారం. వీరి తో పాటు ప‌లు ఉగ్ర‌వాద శిబిరాల‌ను కూడా కూడా భార‌త ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ ఆప‌రేష‌న్ కు సంబంధించిన వివ‌రాల‌ను భార‌త్ సైన్యం .. భార‌త ప్ర‌భుత్వం ఈ రోజు మ‌ధ్యాహ్నం లోపు అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. ఇది కేవ‌లం టీజ‌ర్ మాత్ర‌మే అని.. అస‌లు సినిమా ముందు ఉంద‌ని భార‌త్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: