ఇండియా, పాకిస్తాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అటు పాకిస్థాన్లో భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నప్పటికీ కానీ పాకిస్తాన్లోని కొన్ని ముఠాలు పాకిస్తాన్ వంటి ప్రాంతాలలో పలు రకాల విధ్వంశాలు సృష్టిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భారత్ ఉగ్రవాద స్థావరాలను చావు దెబ్బ కొట్టేలా ప్లాన్ చేసి మరి సక్సెస్ అయినట్లుగా వినిపిస్తున్నది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో సిందూర్ ఆపరేషన్ పేరుతో భారత్ ఉగ్రవాద నిరోధకానికి పునాది వేసింది.


ఈ దాడిలో పంజాబీలోని బహాల్వాపూర్ నగరం ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా శిథిల వ్యవస్థకు గురయ్యేలా చేసింది. భవల్పూర్ మర్కజ సుభాన్ అల్లాహ్ కు సుమారుగా కొన్నేళ్ల నుంచి ఆదిత్యం ఇస్తూ ఉన్నదట.. 2015 నుంచి అక్కడ శిక్షణ బోధన కోసం జైష్ కార్యచరణ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తూ ఉన్నారట ఈ ఉగ్రవాది. ఫిబ్రవరి 14, 2019 న పుల్వామా దాడిలో  ఈ ఉగ్రవాది హస్తం కూడా ఉన్నది. వీరే కాకుండా మసూద్ ఆజర్ కుటుంబం, మౌలానా అమర్, ముక్తి అబ్దుల్ రఫ్, ఇతరత్రా సభ్యుల నివాసాలు కూడా ఉన్నాయట.


ఇక్కడ నుంచి మసూద్ ఎన్నో ప్రసంగాలను కూడా చేశారని భారత్కు వ్యతిరేకంగా ద్వేషాన్ని రగిలించేలా మాట్లాడుతూ ఉండేవారని జీహాద్ తరహాలో యువతని చేరేలా ప్రేరేపించే వారన్నట్లుగా వినిపిస్తోంది. ఇటీవలే ఆపరేషన్ సింధూర పేరుతో చేపట్టిన భారత్ సాయుధ దళాలను నిర్వహించి క్షిపణుల దాడులతో బహల్పూర్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తున్నది. మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆపరేషన్ సింధూర్ లక్ష్యాన్ని వివరించారు. లస్కేరే తోయిబా (LET) జైసే మహమ్మద్ ( MA) సంబంధించి పిఓజేకే అనుబంధించబడిన ఈ ఐదు స్థావరాలతో పాటుగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకొని భారత్ సైన్యం, నావిదళం ,వైమానిక దళంతో వీటన్నిటిని అంతం చేసామంటు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: