ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆపరేషన్ సిందూర్ పేరే బాగా మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితులు అందరికీ తెలిసిందే.  సరిహద్దు రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితుల కొనసాగుతున్నాయి . మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి ప్రయోగం చేస్తుందో అని దానిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలి అని ఇండియన్ ఆర్మీ తిండి నిద్ర లేకుండా 24 గంటలు  చాలా అలర్ట్ గా ఉంది.  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే ఇండియన్ ఆర్మీ యొక్క పని అని ఇండియన్ ఆర్మీ పూర్తిగా ఆపరేషన్ సిందూర్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది . కాగా  ఇలాంటి మూమెంట్లోనే కొన్ని ఫేక్ వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .


మరి ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ కారణంగా ఏటీఎంలో డబ్బులు ఉండవు అని.. అంతేకాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా మొత్తం నిలిపివేస్తుంది అని .. సైబర్ క్రైమ్ దాడులో జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ రకరకాల ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే తాజాగా నిర్మల సీతారామన్ దానిపై క్లారిటీ ఇచ్చారు . ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి అంటూ బ్యాంకులకు స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం . బ్యాంకుల అప్రమత్తంగా ఉండాలి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నిర్దేశించారు . వినియోగదారులకు వ్యాపారులకు ఎట్టి పరిస్థితులను ఇబ్బందులు కలగకూడదని భారత్ - పాక్ ఉద్రిక్తల వేళ నిర్మల సీతారామన్ బ్యాంకులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు .



అంతరాయం లేని సేవలు అందించాలి అని.. సైబర్ భద్రత పై ఆర్బిఐ బ్యాంకులో భీమా సంస్థలు ఉన్నత అధికారులతో ఆమె  మీటింగ్ నిర్వహించారు. నిర్మల సీతారామన్ మాట్లాడుతూ "సవాళ్ళతో కూడిన సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు నగదు లావాదేవీలు .. విత్ డ్రాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ సరైన సమాచారం వినియోగదారులకు ఇవ్వాలి అంటూ ఆమె సూచించారు". మరీ ముఖ్యంగా డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి అంటూ నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.



ఏటీఎంలలో సరిపడ నగదు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అని యూపీఐ సర్వీసులు సజావుగా సాగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అని ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అంటూ నిర్మలా సీతారామన్ నిర్దేశించారు . దేశ సరిహద్దు ప్రాంతంలోని శాఖలలో నిధులు నిర్వహిస్తున్న బ్యాంక్ ఉద్యోగులకు అలాగే వాళ్ళ కుటుంబాల భద్రత కోసం చొరవ చూపాలి అంటూ సూచించారు. అంతే కాదు సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యే ఫేక్ వార్తలు నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఆమె చెప్పుకు వచ్చారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: