పెహల్గామ్ దాడి తర్వాత  ఇండియా కన్నెర్ర జేసింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని  ఆపరేషన్ సింధూర్ పేరుతో  ముప్పేట దాడి చేసింది. దీంతో పాకిస్తాన్ లోని ఉగ్రస్త్రావరాలపై మిస్సైల్స్ దాడి చేసి దాదాపు ఉగ్రవాదులను హతమార్చింది. ఆ విధంగా కొనసాగుతున్న తరుణం లోనే  పాకిస్తాన్ ఆర్మీ కూడా ఆపరేషన్ సింధూర్ పేరు తో ఉగ్రవాదులపై మరియు పాక్ ఆర్మీ బేస్ లపై వరుస దాడులు చేసింది. ముఖ్యంగా ఈ దాడులకు  మహిళా అధికారి వ్యోమికా సింగ్, ఆర్మీ కల్నల్   సోఫియా ఖురేషి   ఆధ్వర్యం లో చేసింది. పాకిస్తాన్ లో ఎలాంటి దాడులు జరిగాయి ఎంత నష్టమైందనేది  ఆమె మీడియా సమావేశంలో తెలియజేసింది. ఆ వివరాలు చూద్దాం. 

భారత బలగాలు పాకిస్తాన్ కి తీవ్రమైన నష్టాన్ని కలిగించాలని తెలియజేశారు. వారి యొక్క సైనిక స్థావరాలు, భూ భాగాలు వైమానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు నిర్వహించామని అన్నారు. ముఖ్యంగా కర్దు, జకోబాబాద్, సర్గోడ, ప్రాంతాలలో వరుస దాడులు చేసిందని తెలియజేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ రాడార్ సిస్టం, వాయు రక్షణ చర్యలను ధ్వంసం చేశామని అన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులతో పాటు, సైన్యం స్వీయ  రక్షణ కు సంబంధించిన వ్యవస్థ లో చాలా నష్టం జరిగిందని తెలియజేశారు.

ఈ విధంగా పాకిస్థాన్ పై భారత్ దాడి చేయడం వల్ల దాదాపు వేలాది కోట్ల రూపాయలు పాకిస్తాన్ నష్టం జరిగిందని  తెలియజేశారు. అవమానాన్ని తట్టుకోలేని పాకిస్తాన్ ఆర్మీ  ఇండియా లోని కీలక భాగాల పై దాడులు చేయడం వల్ల భారీ నష్టం జరిగిందని సోషల్ మీడియా లో చెప్పుకోవడం సిగ్గు చేటని తెలియజేశారు. పాకిస్తాన్ వల్ల ఇండియా కి ఎలాంటి నష్టం జరగలేదని, ఇండియన్ ఆర్మీ చేసిన దాడి వల్ల పాకిస్థాన్ లో వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఆర్మీ కోలుకోవడానికి చాలా టైం పడుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: