భారత్, పాకిస్తాన్ మధ్య చెలరేగిన యుద్ధంలో పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరణించడమే కాకుండా కొంతమంది సైనికులు కూడా మరణించారు.. అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న పాకిస్తాన్ దొంగ చాటుగా దెబ్బ వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలా ఇప్పటికే కొంతమంది ఇండియన్ ఆర్మీ సైనికులు కూడా మరణించారు. బిఎస్ఎఫ్ అధికారి ఒకరు మరణించగా మరొకరు మురళి నాయక్ కాగా మరికొంతమంది మరణించారు. అయితే ఇప్పుడు తాజాగా దేశం కోసం మరొక సైనికుడు ప్రాణాలు అర్పించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ కాల్పులు జరిపిన సమయంలో రైఫిల్మ్ సునీల్ కుమార్ వీరమరణం పొందాలని అధికారులు తెలియజేస్తున్నారు.


జమ్మూ కాశ్మీరులో ఆర్ఎస్ పురా సెక్టార్లలో జరిగిన దాడిలో 25 ఏళ్ల రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్ మరణించరు. సునీల్ కుమార్ స్వస్థలం జమ్మూలోని  ట్రైవా గ్రామంలో జన్మించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైఫిల్ సునీల్ కుమార్ ఆదివారం అమరుడయ్యారట. ఈ జవాన్ మృతదేహాన్ని ఆయన నివాసానికి సైనికులు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది సునీల్ కుమార్ మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతం అవుతున్నారు.


అలాగే మరొకవైపు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన అమర జవాన్ మురళి నాయక్ కూడా వీరమరణం పొందడంతో ఇటీవలే అంతక్రియలను కూడా పూర్తి చేశారు. వీర జవాన్ కు జనాలు కూడా భారీగా నివాళులు అర్పించి తరలివచ్చారు. జై జవాన్ జై మురళి అంటూ పలు రకాల నినాదాలు కూడా చేస్తూ వాహనం వెంట భారీగానే ర్యాలీగా ప్రజలు వెళ్లారు. మురళి నాయక్ అంత్యక్రియలు సైనిక లాంచనాలతో జరిగాయి. ఇక ఏపీ ప్రభుత్వం కూడా మురళి నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలంతో పాటు 50 లక్షలు రూపాయలు నగదు 300 గజాలు ఇంటిని ఇంటిలో ఒక ఉద్యోగం కూడా కల్పించబోతున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: